విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయటానికి కేంద్రం రంగం సిద్ధం చేసేసింది. సంస్ధను ప్రైవేటీకరణ చేయటానికి తగిన సలహాలు, సూచనలు ఇచ్చే సామర్ధ్యం ఉన్న న్యాయ సలహాదారు నియామకానికి ప్రకటనిచ్చింది. తాజాగా జరిగిన డెవలప్మెంట్ తో ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం ఏమాత్రం వెనక్కు తగ్గటంలేదని అర్ధమైపోయింది.
ప్రజలు డబ్బులు ఇస్తే ఇలాంటివి పట్టించుకోరని ఊహించి అప్పట్లో అమ్మకానికి జగన్ ఓకే చెప్పేశారు. తీరా జనం తిరగబడే సరికి తాను కూడా వ్యతిరేకించడం మొదలుపెట్టారు. అయితే, అప్పటికే ఒప్పందం అయిపోయింది. ప్రాసెస్ మాత్రమే పెండింగ్ ఉంది. ఆ ప్రాసెస్ ఇపుడు స్టార్ట్ అయ్యింది.
వైజాగ్ స్టీల్ సంస్ధతో పాటు దానికి అనుబంధంగా ఉన్న వేలాది ఎకరాల స్ధలాన్ని కూడా కేంద్రం అమ్మకానికి పెట్టేయబోతోంది. స్టీల్స్ కు అనుబంధంగా ఉన్న ఇతర యూనిట్లను కూడా అమ్మకం జాబితాలో రెడీ చేసేసింది.
ఒకవైపు వైజాగ్ స్టీల్స్ ప్రైవేటుపరం చేయటాన్ని ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు, తదితరులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కానీ జగన్ మాత్రం మోడీని గట్టిగా దీనిపై ఒక్క విమర్శ చేయలేకపోతున్నారు. కోర్టులో కేసు కూడా వేయలేకపోయారు.
బీజేపీ+జనసేన కూడా జగన్ కు వంత పాడాయి. దీంతో అమ్మకం ఊపందుకుంది. ప్రతిపక్షాలు, ఉద్యోగ, కార్మిక సంఘాలు కూడా ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
అయితే ఎవరినుండి ఎంత వ్యతిరేకత వస్తున్నా నరేంద్రమోడి సర్కార్ ఏమాత్రం లెక్కచేయటంలేదు. తాను అనుకున్నది అనుకున్నట్లు చేయాలనే మొండి పట్టుదలతో ముందుకే అడుగులు వేస్తోంది. నష్టాల్లో ఉన్న సంస్ధలను అమ్మేస్తున్నారంటే అర్ధముంది. కానీ లాభాల్లో ఉన్న వైజాగ్ స్టీల్స్ ను కూడా అమ్మేయాలని నిర్ణయించటమే ఆశ్చర్యంగా ఉంది.
ఏపీ ముఖ్యమంత్రి గట్టిగా నిలబడలేకపోతే ఈ అమ్మకం ఆగదు. కానీ ఆయనకు మోడీ అవసరం ఉండటం రాష్ట్రం చేసుకున్న దురదృష్టం.