సీఎం అంటే ఇలా ఉండాలి అని మరోసారి చంద్రబాబు నిరూపించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నవ్యాంధ్రలో కుంటుపడిన అభివృద్ధిని పరుగులు పెట్టించడమే లక్ష్యంగా బాబు పని చేస్తున్నారు. ప్రజాసేవలో ఎల్లప్పుడూ ముందుంటున్నారు. తాజాగా చంద్రబాబు మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. ఇచ్చిన మాటను 24 గంటలు గడవక ముందే నిలబెట్టుకుని దటీజ్ చంద్రబాబు అనిపించుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కోసం చంద్రబాబు మంగళవారం కర్నూలు జిల్లాలో పర్యటించారు. లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పెన్షన్ అందించారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే పత్తికొండ మండలం పుచ్చకాయలమడలో తలారి గంగమ్మ అనే మహిళ చిన్న కుమారుడు అశోక్ కుమార్ పదో తరగతి చదివి అద్దె ఆటో నడుపుతున్నాడని బాబు తెలుసుకున్నారు. తన కుమారుడికి ఎలక్ట్రికల్ ఆటో ఇప్పించాలని గంగమ్మ కోరడంతో.. అందుకు సీఎం తప్పకుండా ఆమె కుంటుబానికి అండంగా ఉంటామని హామీ ఇచ్చారు.
అయితే అలా మాట ఇచ్చారో లేదో.. ఇలా నిలబెట్టుకున్నారు. 24 గంటలు గడవక ముందే అశోక్‌కు రూ.3.80 లక్షల విలువ చేసే ఆటోను కర్నూలులో ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు సమక్షంలో కలెక్టర్ రంజిత్‌బాషా బుధవారం అందజేశారు. దాంతో అశోక్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అలాగే పింఛన్ల పంపిణీ అనంతరం సభా వేదిక వద్ద చంద్రబాబు ప్రసగింస్తుండగా.. మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న వెంకటరాముడు, నరాల సంబంధిత వ్యాధితో బాధపడుతున్న రాముడు సాయం చేయాలని కోరారు. వారికి కూడా బాబు అండగా నిలిచారు. బుధవారం వెంకటరాముడు, రాముడికి సీఎం సహాయ నిధి కింద చెరో రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయాన్ని కలెక్టర్ రంజిత్‌బాషా అందజేశారు.