ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత జూలై 1న జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమం సూపర్ సక్సెస్ అయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేశారు. వాలంటీర్లతో సంబంధం లేకుండా ఒక్కరోజులోనే రాష్ట్రంలో 90శాతం మంది లబ్ధిదారులకు ఫెన్షన్ అందజేశారు. దీంతో ఇప్పుడు సీఎం చంద్రబాబు తన నెక్స్ట్ ఫోకస్ ను స్కిల్ సెన్సెస్ కార్యక్రమం పెట్టారు.
రాష్ట్రంలో విద్యార్థులు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కూటమి సర్కార్ స్కిల్ సెన్సెస్ కార్యక్రమాన్ని నిర్వహించబోతోంది. చంద్రబాబు నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే సంతకం చేసిన ఐదు ఫైల్స్ లో నైపుణ్య గణన(స్కిన్ సెన్సేస్) ఫైల్ కూడా ఒకటి. రాష్ట్ర యువతలో నైపుణ్యాలను గుర్తించి ఆయా విభాగాల్లో శిక్షణ ఇప్పించేందుకు ప్రభుత్వం తలపెట్టిన స్కిల్ సెన్సెస్ కార్యక్రమం అమలుకు కేమినేట్ లో కూడా ఆమోదం తెలిపింది.
దీంతో మంగళవారం స్కిల్ డెవలప్ మెంట్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్ష సమావేశం నిర్వహించాను. స్కిల్ సెన్సెస్ కార్యక్రమానికి వివిధ శాఖలను భాగస్వామ్యం చేయడానికి విధివిధానాలపై అధికారులతో చర్చలు జరిపారు. ఏపీఎస్ఎస్ డీసీ, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఇంటింటి సర్వే చేపట్టాలని నిర్ణయించారు.
గ్రామాల్లో చదువుకున్న యువత ఎంత మంది ఉన్నారు..? ఏఏ రంగాల్లో శిక్షణ పొందేందుకు సిద్ధంగా ఉన్నారు..? వారి నైపుణ్యాలేంటి? తదితర వివరాలను ఈ సర్వే ద్వారా సేకరించబోతున్నారు. ఈ సర్వే పూర్తి చేశాక కంపెనీలు, పరిశ్రమలు ఎలాంటి నైపుణ్యాలు కోరుకుంటున్నాయో ప్రభుత్వం గుర్తిస్తుంది. అనంతరం స్కిల్ సెన్సెస్ కార్యక్రమం ద్వారా స్వదేశం, విదేశాల్లో డిమాండ్ ఉన్న కోర్సులలో యువతకు రాష్ట్ర ప్రభుత్వం శిక్షణ ఇవ్వనుంది. తద్వారా నైపుణ్యాభివృద్ధిలో యువతకు ఉపాధి కల్పనకు పెద్దపీట వేయబోతోంది.