జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీని సాధించిన సంగతి తెలిసిందే. కూటమి నుంచి 21 స్థానాల్లో పోటీ చేసిన జనసేన అభ్యర్థులందరూ గెలుపొందారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కూటమి అధికారంలోకి వచ్చింది. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా మరియు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్ డబ్ల్యూ ఎస్, పర్యావరణ, శాస్త్రసాంకేతిక, అటవీశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు.
అయితే ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం కీలక వ్యవహరిస్తున్న పవన్ కళ్యాణ్.. ఇకపై సినిమాలను కంటిన్యూ చేస్తారా? చేయరా? అన్న అనుమానాలు అందరిలోనూ ఉన్నాయి. ఎమ్మెల్యేగా, మంత్రిగానే కాకుండా డిప్యూటీ సీఎంగా కూడా బాధ్యతలు చేపట్టడంతో నిర్మాతలు సైతం సినిమాలు చేయమని ఆయన్ను అడితే పరిస్థితి కనిపించలేదు. కొత్త సినిమాల గురించి పక్కన పెడితే.. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ మూడు సినిమాకు శంకుస్థాపన చేశాడు.
ఈ జాబితాలో ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ, హరిహర వీరమల్లు చిత్రాలు ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మాతమవుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ కు హరీష్ శంకర్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. డి.వి.వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో సుజీత్ దర్శకత్వంలో ఓజీ ప్రారంభమైంది. హరి హర వీర మల్లు సినిమాను క్రిష్ స్టార్ట్ చేశాడు. ఈ మూడు చిత్రాలు ఆల్రెడీ కొంత షూటింగ్ ను కంప్లీట్ చేసుకున్నాయి.
గత కొద్ది నెలల నుంచి పవన్ పాలిటిక్స్ లో బిజీ అవ్వడంతో ఈ మూడు చిత్రాల షూటింగ్స్ నిలిచిపోయాయి. ఇప్పుడీ సినిమాల పరిస్థితేంటి..? పవన్ వీటిని పూర్తి చేస్తాడా..? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. గతంలో ఒప్పుకున్న మూవీస్ ను పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ తాజాగా డిసైడ్ అయ్యారట. వారానికి రెండు రోజులు షూటింగ్ కోసం కేటాయిస్తానని అభయహస్తం ఇచ్చాడట. దాంతో ఆయా సినిమాల నిర్మాతలు కాస్త ఊపిరి పీల్చుకున్నారట. అంతేకాదు, షూటింగ్ రీస్టార్ట్ చేసేందుకు సన్నాహాలు కూడా మొదలు పెట్టారని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.