జనసేన అధినేత పవన్ కల్యాణ్.. పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేస్తున్న సమయంలో జ్వరం బారిన పడిన విషయం తెలిసిందే. దీంతో ఆయన హైదరాబాద్కు వెళ్లి.. గత రెండు రోజులుగా రెస్ట్ తీసుకుంటున్నారు. అయితే.. ప్రస్తుతం ఆయన జ్వరం నుంచి కోరుకున్నారు. దీంతో మరోసారి ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు. ఆదివారం నుంచి పవన్ తన ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. `వారాహి విజయభేరి యాత్ర`ను ఆదివారం నుంచి ఉత్తరాంధ్రలో మొదలు పెట్టనున్నారు.
మలి విడత యాత్రలో భాగంగా అనకాపల్లిలో 7న సభ నిర్వహించనున్నారు. 8న ఎలమంచిలి, 9న పిఠాపురంలో సభ నిర్వహించనున్నారు. ఆ తరువాత జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్న నెల్లిమర్ల, అనకాపల్లి, యలమంచిలి నియోజకవర్గాల్లో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. వాస్తవానికి పిఠాపురం తర్వాత ఆయన తెనాలిలో ప్రచారం చేయాల్సి ఉంది. అయితే.. అనూహ్య అనారోగ్య కారణంగా ఆయన పిఠాపురంలో పర్యటనతో సరిపెట్టుకున్నారు. దీంతో తెనాలిలో చేయాల్సిన పర్యటన వాయిదా పడింది. ప్రస్తుతం దీనిని రద్దు చేసుకున్నట్టు సమాచారం.
మరోవైపు.. టీడీపీ-జనసేన-బీజేపీ పార్లమెంటు స్థాయి ఉమ్మడి సమన్వయ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్లమెంట్ స్థాయిలో ఉమ్మడి సమన్వయ సమావేశాలు నిర్వహించనున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం పై చర్చించి కూటమి కార్యాచరణను రూపొందించుకోనున్నారు. ఎన్నికలు సన్నద్ధత, ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్, కొత్త ఓటర్లు, ఇతర ప్రాంతాల్లో నివసించే ఓటర్లు, పోస్టల్ ఓట్లు, బూత్ ఏజెంట్ లు తదితర అంశాలపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు.
కూటమి తరపున భారీ బహిరంగ సభలు నిర్వహణ, సామాజిక మాధ్యమాల్లో ఎంపీ ఎమ్యెల్యే అభ్యర్థులు ప్రచారం పై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఎంపీ అభ్యర్థి మేనిఫెస్టో ఇతర స్థానిక సమస్యలపైనా చర్చించనున్నారు. కూటమి పార్లమెంట్ స్థాయి అభ్యర్థులు, పార్టీ అధ్యక్షులు పాల్గొననున్నారు. పవన్ కల్యాణ్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయనున్నారు. మొదట జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్న చోట ప్రచారం పూర్తి చేస్తారు. తర్వాత ఉమ్మడి ప్రచార వ్యూహాలను ఖరారు చేయనున్నారు.
జెన్యూన్ గా ఇంత జనం ప్రతీ రాజకీయ నాయకుడికి ఒక కల. దానిని నిజం చెయ్యగల సత్తా ఒక్క పవన్ కళ్యాణ్ నిజాయితీ కి మాత్రమే ఉంది. Hope of Andhra Pradesh …@PawanKalyan pic.twitter.com/PgF8YXm3a2
— Boss Baby (@pepparsalt9) April 5, 2024