మొదటిసారిగా చంద్రబాబు కుటుంబ సభ్యులు నారా బ్రాహ్మణి, భువనేశ్వరి రాజకీయ తెరపై కనిపిస్తున్నారు. చంద్రబాబు ఏనాడూ సెంటిమెంట్ రాజకీయాలపై ఆసక్తి చూపలేదు. కానీ వైఎస్ కుటుంబం నిత్యం సెంటిమెంట్ రాజకీయాలపైనే తమ భవిష్యత్తును నిర్మించుకుంది. ఠాగూర్ సినిమాలో చెప్పినట్టు ఏపీ ప్రజలు సెంటిమెంటల్ ఫూల్స్. అందుకే … సీబీఐ కేసుల్లో 43 వేల కోట్ల ఛార్జిషీట్ ఉన్న వ్యక్తిని సెంటిమెంటుతో కళ్లు మూసుకుపోయి సీఎం కుర్చీలో కూర్చోపెట్టారు. అయితే ప్రజలకు ఉన్న సెంటిమెంట్ వారు ఎన్నుకున్న లీడరుకు లేదని లేటుగా అర్థమైంది.
ఇక చంద్రబాబును బలవంతంగా ఆధారాలు దొరకకముందే కేసులో ఇరికించి జగన్ జైలుకు పంపగలిగారు. దీంతో వేరే అవకాశం లేక చంద్రబాబు కుటుంబం రాజకీయ తెరపై అడుగుపెట్టింది. అయితే భువనేశ్వరి వస్తుందని అనుకున్నారు కానీ… నారా బ్రాహ్మణి రాజకీయ ఎంట్రీ ఇస్తుందని ఎవరూ ఊహించలేదు.
అయితే… నారా బ్రాహ్మణి ఎంట్రీతో తడబడిన వైసీపీ అయోమయంలో ఆమెను కూడా టార్గెట్ చేసింది. నిజానికి రాజకీయాలతో సంబంధం లేని వివాదాస్పద కాని నారా బ్రాహ్మణిపై చేసే ప్రతి కామెంట్ వైసీపీకి నష్టం చేస్తుంది. అయితే ఈ విషయం గమనించని వైకాపా నాయకులు ఆమెపై విమర్శలు చేస్తున్నారు.
ఇప్పుడు లోకేష్‌ని, ఆయన తండ్రిని ఉద్దేశించి రోజా, మరికొందరు వైఎస్ఆర్సిపి నేతలు బ్రాహ్మణిపై మామూలుగా దాడి చేయడం మొదలుపెట్టారు.
ఏది ఏమైనప్పటికీ, బ్రాహ్మణి రాజకీయేతర వ్యక్తిగా మరియు క్లీన్ ఇమేజ్ ఉన్న యువతిగా భావించే సాధారణ ప్రజలు ఈ కఠినమైన దాడిని ఇష్టపడరని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బ్రాహ్మణిపై వైఎస్ఆర్సిపి తరహా రాజకీయ దాడి మహిళలు మరియు తటస్థ ఓటర్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓటు బ్యాంకును దెబ్బతీస్తుందని చాలా మంది భావిస్తున్నారు.