రాజమండ్రి సెంట్రల్ జైల్లో టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన ప్రకటన చేశారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ,జనసేనల మధ్య పొత్తు ఉంటుందని, టీడీపీ,జనసేనలు కలిసి పోటీ చేస్తాయని నిర్ణయం తీసుకున్నానని పవన్ ప్రకటించారు.
ఉత్కంఠకు తెరపడింది. సందిగ్ధత తొలగిపోయింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదశం, జనసేన పార్టీలు కలిసి పోటీ చేయబోతున్న విషయం అధికారికం అయిపోయింది. ఎన్నికలు మరింత దగ్గర పడ్డాక తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినే పవన్ కళ్యాణ్ కలిసి కూర్చుని మాట్లాడుకుని, సీట్ల పంపకంపై ఒక అంచనాకు వచ్చాక అధికారికంగా పొత్తును ప్రకటిస్తారని అనుకుంటే.. అంతకంటే ముందే అనూహ్య పరిణామాల మధ్య పవన్ కళ్యాణ్ పొత్తుపై సంచలన రీతిలో ప్రకటన చేసి అందరికీ పెద్ద షాకిచ్చాడు.
స్కిల్ డెవలప్మెంట్ కేసుకులో అరెస్ట్ అయిన చంద్రబాబు నాయుడిని కలిసేందుకు గురువారం రాజమండ్రికి వెళ్లిన పవన్.. ఆయనతో ములాఖత్ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ పొత్తు మీద ప్రకటన చేయడం సంచలనం రేపింది. పక్కన తెలుగుదేశం జాతీయ కార్యదర్శి నారా లోకేష్, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా ఉండగా.. పవన్ ఈ ప్రకటన చేయడం విశేషం. ‘‘ఈ రోజు నేను నిర్ణయం తీసుకున్నాను. ఈ రోజు నేను నిర్ణయం తీసుకున్నాను. జనసేన, తెలుగుదేశం కలిసి వెళ్తాయి వచ్చే ఎన్నికల్లో. ఇది మా ఇద్దరి భవిష్యత్తుకు సంబంధించింది కాదు.
ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు సంబంధించింది’’ అని నారా లోకేష్, బాలయ్యలతో పాటు తెలుగుదేశం, జనసేన నాయకు చప్పట్ల మధ్య పవన్ ప్రకటన చేశాడు. అంతే కాక కలిసి వచ్చే పార్టీలను కూడా కలుపుకుని తాము ఎన్నికల్లో పోటీ చేస్తామని పవన్ ప్రకటించాడు. వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వనని పవన్ మరోసారి ఈ సందర్భంగా స్పష్టం చేశాడు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుండాలన్నదే తన ఆకాంక్ష అని పవన్ పేర్కొన్నాడు. పవన్ పొత్తు ప్రకటన ఒక్కసారిగా రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతోంది.
చంద్రబాబు గారి అక్రమ అరెస్ట్ ని ఖండించిన జనసేన అధినేత @PawanKalyan గారు #IAmWithBabu#PeopleWithNaidu#FalseCasesAgainstNaidu #CBNWillBeBackWithABang pic.twitter.com/LaO1avg0SV
— Telugu Desam Party (@JaiTDP) September 14, 2023
విజన్ 2020తో సైబరాబాద్ అనే ఒక కొత్త నగరాన్ని నిర్మించిన ఘనత చంద్రబాబు గారిది. లక్షల కోట్ల సంపద సృష్టించిన చంద్రబాబు గారిపై రూ.317 కోట్ల స్కాం అంటూ అభియోగం మోపడం బాధాకరం – జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు#IAmWithBabu#PeopleWithNaidu#FalseCasesAgainstNaidu #CBNWillBeBackWithABang pic.twitter.com/8k5XC0XMyZ
— Telugu Desam Party (@JaiTDP) September 14, 2023