• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

చంద్రబాబు కు ఐటీ ఉద్యోగుల బాసట..దద్దరిల్లిన హైటెక్ సిటీ

admin by admin
September 14, 2023
in Andhra, Politics, Telangana, Trending
0
0
SHARES
127
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

స్కిల్ స్కాం జరిగిందన్న ఆరోపణలతో ఏపీ విపక్ష నేత చంద్రబాబు అరెస్టు కావటం.. ప్రస్తుతం ఆయన రిమాండ్ లో ఉండటం తెలిసిందే. రాజమహేంద్రవరం జైల్లో ఉన్న ఆయనకు మద్దతుగా.. ఆయన అరెస్టును తప్పు పడుతూ జరుగుతున్న నిరసనల్లో కొత్త కోణం బయటకు వచ్చింది. బాబు అరెస్టు వేళ.. ఏపీ ప్రజల నుంచి వచ్చిన స్పందన అంతంత మాత్రంగానే ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇలాంటివేళ.. టీడీపీ నేతలు సైతం ప్రజల్లో సానుభూతి పెద్దగా రావట్లేదన్న ఆందోళన తమ వ్యక్తిగత సంభాషణల్లో చేసుకుంటున్నారు.

ఇలాంటివేళ.. అనూహ్యంగా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో చోటు చేసుకుంటున్న ఆందోళనలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా మొదట్లో రాత్రి వేళ.. ఐదుగురు ఐటీ ఉద్యోగులు ముఖానికి మాస్కులు కట్టుకొని.. హైటెక్ సిటీలోని సైబర్ టవర్స్ వద్ద నిరసన చేపట్టటం తెలిసిందే. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మొదలైన నిరసనల పర్వం అంతకంతకూ ఎక్కువ అవుతోంది.

బుధవారం ఈ నిరసనలు పీక్స్ కు చేరుకున్నాయి. నగరంలోని మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే.. ఐటీ కారిడార్ లో ఈ నిరసనల జోరు ఎక్కువగా ఉండటం హాట్ టాపిక్ గా మారింది. మగ.. ఆడ అన్న తేడా లేకుండా ఐటీ ఉద్యోగులు పెద్ద ఎత్తున నిరసన చేయటం.. దీనికి వందలాది యువత రోడ్ల మీదకు వచ్చి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళన చేయటం గమనార్హం. పోలీసులు సైతం ఈ ఆందోళనల్ని అడ్డుకుంటున్నా.. వారు ససేమిరా అనటం.. చివరకు లాఠీ ఛార్జ్ చేసినా వెనక్కి తగ్గకపోవటం చూసినప్పుడు.. ఏపీ కంటే ఐటీ కారిడార్ లో చేస్తున్న నిరసనలే ఎక్కువగా ఉన్నాయన్న మాట వినిపిస్తోంది.

చంద్రబాబు కోసం తాము ఎంతవరకైనా పోరాటతామని.. కుల మతాలు.. రాజకీయాలకు అతీతంగా తాము నిరసన తెలుపుతున్నట్లుగా వారు చెబుతున్నారు. చంద్రబాబు వల్లే హైదరాబాద్ లో ఐటీ రంగం డెవలప్ అయ్యిందని వారి నోట పెద్ద ఎత్తున వినిపిస్తోంది. బుధవారం ఉదయం నానర్ రాం గూడలోని విప్రో సర్కిల్ వద్ద ఈ ఆందోళనలు జరిగితే..రాత్రి వేళ కూకట్ పల్లి -జేఎన్ టీయూ మధ్య పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి.

దాదాపు రెండు గంటల పాటు సాగిన ఈ నిరసనలతో అక్కడి ట్రాఫిక్ పెద్ద ఎత్తున జాం కావటమే కాదు.. ఏపీలోని ఏ ప్రాంతంలోనూ ఇంత పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది లేదన్న మాట పలువురి నోట వినిపించటం గమనార్హం. అంతేకాదు.. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఇక రోజువారీగా నిరసనలు హైదరాబాద్ లో చేపడతామన్న మాట పలువురి నోట వినిపించటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Tags: arrestChandrababuhitech cityHyderabadit employeesvision
Previous Post

జనాల్లోకి భువనేశ్వరి ?

Next Post

టీడీపీతో జనసేన పొత్తు ఉంటుంది…పవన్ షాకింగ్ ప్రకటన

Related Posts

Amaravati rally
Politics

AP : అమరావతిలో పోలీసులను లెక్క చేయని ప్రజలు

October 1, 2023
pawan kalyan varahi yatra
Politics

సైకిల్, గ్లాస్ కలిసి ఫ్యాన్‌ను తరిమేయడం ఖాయం – పవన్

October 1, 2023
Andhra

TANA-విద్యార్థులకు ఆసరాగా నిలుస్తున్న ఠాగూర్‌ మల్లినేని!

October 1, 2023
nara bhuvaneswari with lokesh
Andhra

భువనేశ్వరి మనోబలం… పార్టీలో ఆశ్చర్యం!

October 1, 2023
nara bramhani with janasena
Andhra

నారా బ్రాహ్మణి… వైసీపీ కొత్త భయం !!

October 1, 2023
jagan thinks about kamma
Andhra

జగన్ ఊహించని రెండు పరిణామాలు

October 1, 2023
Load More
Next Post

టీడీపీతో జనసేన పొత్తు ఉంటుంది...పవన్ షాకింగ్ ప్రకటన

Latest News

  • AP : అమరావతిలో పోలీసులను లెక్క చేయని ప్రజలు
  • సైకిల్, గ్లాస్ కలిసి ఫ్యాన్‌ను తరిమేయడం ఖాయం – పవన్
  • శశికాంత్‌ వల్లేపల్లి ఉదారత…700మందికి వైద్యసేవలు!
  • TANA-విద్యార్థులకు ఆసరాగా నిలుస్తున్న ఠాగూర్‌ మల్లినేని!
  • భువనేశ్వరి మనోబలం… పార్టీలో ఆశ్చర్యం!
  • నారా బ్రాహ్మణి… వైసీపీ కొత్త భయం !!
  • జగన్ ఊహించని రెండు పరిణామాలు
  • కేసీఆర్ కి ఇది పెద్ద షాకే!
  • రెండు దశాబ్దాలు..!మృత్యుంజయుడై నిలిచిన చంద్రబాబు!!
  • మంచు విష్ణు.. నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్
  • ‘హుకూం’ పాట అసలు లేనే లేదట
  • ఆ 10 సీట్ల కోసమే కేటీఆర్ ఎన్టీఆర్ జపం ?
  • ఆ నినాదంతో ఉద్య‌మిస్తాం అంటోన్న బాల‌కృష్ణ
  • Political Analysis: వై నాట్‌ టీడీపీ-జనసేన కూటమి?
  • చంద్రబాబు అరెస్ట్..జగన్ కు నటుడు రవిబాబు రిక్వెస్ట్

Most Read

తాడేపల్లి ప్యాలెస్ ‘కాపలా కుక్క ఉండవల్లి అరుణ్ కుమార్’- బుచ్చిరాం ప్రసాద్!

సుప్రీం కోర్టులో చంద్రబాబు కు చుక్కెదురు

కమ్మ కులం పూజారి జగన్ !

చంద్రబాబు కు షాక్..సుప్రీంలో కేవియట్ పిటిషన్

సాయిరెడ్డికి షాక్.. చంద్రబాబు కు మద్దతుగా టీడీపీలోకి వైసీపీ నేతలు

ఆర్కే కొత్తపలుకులో ఈ కీలక పాయింట్లు గమనించారా?

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra