బీజేపీ పెద్దలు చెప్పిన పని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేయలేదా? వారు చెప్పిన దానికి ఆయన ఓకే చెప్పినా.. తర్వాత మౌనంగా ఉన్నారా? అంటే.. ఔననే అంటున్నారు బీజేపీ నాయకులు. రెండు రోజుల కిందట.. బెంగళూరు నుంచి తిరిగి వస్తూ.. ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు.. ఆయన బృందం ఈ విషయం పై నే చర్చించుకున్నారని.. రాష్ట్రంలోనికీలక నేతలు భావిస్తున్నారు. “పొత్తులో ఉన్నా.. మా మాట వినలేదు“ అని సోము వీర్రాజు పెదవి విరిచారని చెబుతున్నారు.
దీనికికారణం.. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ప్రతిష్టాత్మకంగా పోరాడుతోంది. ప్రస్తుతం అక్కడ అధికారంలో ఉన్న బీజేపీ.. ఈ నెల 10న జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి స్థాయి మెజారిటీ దక్కించుకుని అధికారంలోకి రావాలని భావిస్తోంది. అయితే.. దీనికి ప్రస్తుతంఉన్న దమ్ము సరిపోదని.. తెలుగు వారిని.. ఆకర్షించేందుకు కీలక నాయకులు అవసరం అవుతారని ముందుగానే అంచనా వేసుకుంది. వాస్తవానికి కర్ణాటకలో సెటిల్ అయిన ఇతర రాష్ట్రాల వారిని ఆకర్షించేందుకు.. బీజేపీ ఇదే వ్యూహం వేసింది.
తమిళనాడు, కేరళ, యూపీ, రాజస్థాన్ సహా..ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని తమవైపునకు తిప్పుకొనేం దుకు అక్కడి నుంచి నేతలను రంగంలోకి దింపింది. ఇలానే ఏపీ నుంచి పవన్‌ను కూడా ప్రచారానికి రావాలని కోరినట్టు గతంలోనేవార్తలు వచ్చాయి. పవన్ ఢిల్లీ పర్యటనలో ఉండగానే.. ప్రధాన మీడియాలో నూ.. ఈ తరహా వార్తలు దర్శన మిచ్చాయి. కర్ణాటకలో ప్రచారానికి రావాలని బీజేపీ పెద్దలు పవన్‌ను ఆహ్వానించారని అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ కూడా సాగింది.
అయితే.. మరో రెండు రోజుల్లో కర్ణాటక ఎన్నికల ప్రచారం కూడా ముగిసిపోతున్నప్పటికీ.. పవన్ ఈ విషయంపై ఇంకా దృష్టి పెట్టలేదు. కనీసం.. ఆయన షెడ్యూల్ కూడా ప్రకటించలేదని.. సోము వీర్రాజు పెదవి విరిచినట్టు సమాచారం. దీనిపైఇటు జనసేన నాయకులు కూడా సైలెంట్‌గానే ఉన్నారు. ఎవరికి వారు మౌనంగా ఉన్నా.. సోము చేసిన వ్యాఖ్యలతో మరోసారి పవన్ వ్యవహారం ఆసక్తిగా మారడం గమనార్హం. అయితే.. పొత్తుల విషయంలో తను చెప్పిన దానికి బీజేపీ పెద్దలు స్పందించని కారణంగానే పవన్ దూరంగా ఉన్నారనేది మరో టాక్. మరి ఏం చేస్తారో చూడాలి.