ఏపీలో ఎన్నికలు లెక్క ప్రకారమైతే 2024లో మే నెలలో జరగాల్సి ఉంది. కానీ.. రోజురోజుకీ తన ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుండడంతో అది మరింత ముదరకముందే ఆర్నెళ్ల ముందే ఎన్నికలకు వెళ్లాలని జగన్ అనుకుంటున్నారట. వైసీపీకి చెందిన కొంత మంది సీనియర్ నేతలు తమకు ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదని, అంత అవసరం తమ ప్రభుత్వానికి లేదని చెబుతున్నప్పటికీ లోపల మాత్రం పార్టీ శ్రేణులకు ఎప్పుడు ఎన్నికలు జరిగినా సిద్ధంగా ఉండాలంటూ పార్టీ పెద్దలు ప్రతి సమావేశంలోనూ సెలవిస్తూనే ఉన్నారు.
మే లేదా జూన్ నెలలో ఏ పి అసెంబ్లీ రద్దు
అక్టోబర్ -నవంబర్ మధ్యలో సారస్వత్రాక ఎన్నికలు
ఏప్రిల్ 3 న డేట్లపై క్లారిటీ వస్తుంది అంటున్నారు.
వీటినిబట్టి చూస్తుంటే ప్రస్తుత ఏడాది నవంబరు, డిసెంబరులోనే ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. అదే జరిగితే తెలంగాణతోపాటు ఏపీలో కూడా అసెంబ్లి ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రస్తుత ఏడాది నవంబరులో తెలంగాణకు ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే సూచనలున్నాయి. ఆ దిశగా ఎన్నికల సంఘం కూడా తెలంగాణ అసెంబ్లి ఎన్నికలకు కసరత్తును మొదలు పెట్టింది. తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ను ఎలక్షన్ కమిషన్ అధికారికంగా ప్రకటించనప్పటికీ.. ఎన్నికల తేదీలంటూ కొన్ని తేదీలు ప్రచారంలో ఉన్నాయి.
నవంబరు 18వ తేదీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ ప్రక్రియ మొదలవుతుందని… అదే నెల 28వ తేదీ నామినేషన్ల ఉపసంహరణ, డిసెంబరు 15న పోలింగ్, అదే నెల 19న ఫలితాల వెలువడతాయని.. ఎన్నికల షెడ్యూల్ అంచనా వేస్తున్నారు. ఈ తేదీలలో మార్పులు ఉండొచ్చు.. ఎన్నికల కమిషన్ వెలువరించే తేదీలే ఫైనల్ . అయితే.. ఇదే సమయంలో ఏపీలోనూ ఎన్నికలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
జగన్ తాజాగా దిల్లీలో కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసి వచ్చారు. ఆయన పర్యటనలో ముందస్తు ఎన్నికలపై చర్చా జరిగిందని.. కేంద్రం నుంచి ఆమోదం పొందారని ఢిల్లీ వర్గాల నుంచి వినిపిస్తోంది. కేంద్రం నుంచి క్లియరెన్స్ రావడం వల్లే ఆయన పార్టీ నాయకులతో కీలక సమావేశానికి ఢిల్లీ నుంచే డేట్ ఫిక్స్ చేసి సమాచారం పంపించారు.
ఎమ్మెల్యేలు, మంత్రులు, మిగతా నాయకులతో నిర్వహించే ఈ సమావేశంలో ఎన్నికలకు సిద్ధం కావాలని జగన్ సూచించబోతున్నారని.. అందుకు రోడ్ మ్యాప్ కూడా సిద్ధం చేస్తున్నారని.. ఢిల్లీ పర్యటన తరువాత నాలుగు రోజుల గ్యాప్ తీసుకోవడానికి కూడా కారణం ఇదేనని వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయడానికి అవసరమైన రూట్ మ్యాప్ తయారవుతోందని చెప్తున్నారు.