`వైనాట్ 175` అంటూ.. ఎలుగెత్తిన వైసీపీకి దెబ్బమీద దెబ్బ తగులుతోంది. వచ్చే ఎన్నికల్లో మొత్తం 175 స్థానాల్లోనూ విజయం దక్కించుకుంటామని పదే పదే చెబుతున్న వైసీపీ అధినేత, సీఎం జగన్కు ఇప్పు డు పరిస్థితి అంత ఆశాజనకంగా కనిపించడం లేదు.
ఎక్కడికక్కడ నాయకులు.. తిరుగబాటు ధోరణిలోనే ఉన్నారు. ఇటీవల జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ, తాజాగా జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ.. వైసీపీ ఊహించినట్టు ఏమీ జరగలేదు.
ఊహించని పరిణామాలే.. పార్టీని నిలువునా ముంచేశాయని అంటున్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక ల్లో విద్యావంతులు.. ప్రభుత్వంపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ప్రభుత్వ విధానాలను వారు వ్యతిరేకించిన విషయం స్పష్టమైంది.
ఇక, ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్యేలే లక్ష్మణ రేఖలను దాటేశారు. నిన్న వరకు జగనన్న అన్న నోటితోనే.. చంద్రన్న అనే పిలుపునకు రెడీ అయిపోయారు. దీంతో క్రాస్ ఓటింగ్ జరిగి.. టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయం దక్కించుకున్నారు.
అయితే.. ఈ వైఫల్యానికి.. కారణం ఏంటి? అంటే.. సాక్షాత్తూ జగనేనని చెప్పాలి. 150 మంది(జగన్ కాకుం డా) ఎమ్మెల్యేలను గెలుచుకున్న ఆయన.. ఇప్పటి వరకు ఎమ్మెల్యేలను సంతృప్తి పరచలేదనేది వాస్త వం. గతంలో నియోజకవర్గం నిధులు నేరుగా ఎమ్మెల్యేలకు ఇచ్చేవారు. ఇప్పుడు ఆ ఊసేలేదు. గతంలో లబ్ధిదారులకు.. ఎమ్మెల్యేలకు మధ్య అవినాభావ సంబంధం ఉండేది. ఇప్పుడు అసలు వలంటీర్ తప్ప.. ప్రజలకు ఎవరూ కనిపించడం లేదు.
అదేసమయంలో జగన్ తనకు అవసరం ఉందని భావించిన సమయంలోనే ఎమ్మెల్యేలను పిలుస్తున్నా రు. గత ఏడాది జరిగిన రాజ్యసభ ఎన్నికల సమయంలోను.. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో నూ.. జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలతో మాట్లాడారు. ఇక, గడప గడపలోనూ.. ఎమ్మెల్యేలను రద్దుతున్నారనే వాదన ఉంది. వారిని మానసికంగా ఇబ్బంది పెడుతున్నారనే చర్చకూడా సాగుతోంది. గడపగడపలో హిట్ కొట్టకపోతే.. ఖచ్చితంగా టికెట్ ఇవ్వబోమని మొహంపైనే చెప్పేస్తున్నారు.
ఇక, నిధులు, అభివృద్ధి అనేది లేనేలేదు. దీంతో ఎమ్మెల్యేలకు ప్రజల మధ్య పరాభావం షరా మామూలే అన్నట్టుగా మారిపోయింది. ఈ నేపథ్యంలోనే.. ఎమ్మెల్యేల్లో అసంతృప్తులు పెరిగిపోయారు. పైగా.. ఐప్యాక్ సర్వేల పేరుతో.. ఎమ్మెల్యేకు ప్రతిగా పలు నియోజకవర్గాల్లో ఇంచార్జ్లను నియమించడం ద్వారా ప్రత్య క్ష యుద్ధానికి.. వైసీపీ తలుపులు తెరిచింది. నిజానికి ఇలాంటివి ఎన్నికలకు ముందు చేసుకుంటారు.
కానీ,.. జగన్ ఈ వ్యూహం ఇప్పుడే అవలంభించడంతో టికెట్ రాదని నిర్ణయించుకున్నవారు.. తమకు .. పార్టీకి మధ్య బంధం తెగిందని భావిస్తున్నవారు.. పార్టీకి యాంటీగా మారారు. పోనీ.. యాంటీగా మారుతు న్న వారిని అయినా.. లైన్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారా? అంటే.. అదీ లేదు. పోతేపోనీ.. అన్న ట్టుగా వదిలేస్తున్నారు. ఇదే.. ఇప్పుడు ఎమ్మెల్యేలను పార్టీకి దూరం చేసి.. మొత్తానికి పుట్టిముంచిందని అంటున్నారు పరిశీలకులు.