ఏపీలో సోమవారం జరగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలకు పాల్పడుతోందంటూ.. టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల కమిషనర్‌కు లేఖ రాశారు. ఇక, పార్టీలు కూడా ఆందోళన వ్యక్తం చేశాయి. అయితే.. దీనిపై స్పందించిన సలహాదా రు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. చంద్రబాబుకు ఎప్పుడూ ఇలాంటి జబ్బే పట్టుకుంటుందని ఆక్షేపించా రు. ఆయన మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని కూడా చెప్పారు. అయితే.. బాబు లేఖరాసి.. ఆందోళన వ్యక్తం చేసి ఇంకా 24 గంటలుకూడా గడవక ముందే..ఏకంగా ఏపీ మంత్రి ఒకరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బుల పంపిణీపై ఏకంగా అధికారులతోనే సమీక్షించారు.
ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. వైసీపీ మంత్రి ఉషశ్రీ చరణ్ ఓటర్లకు డబ్బుల పంపిణీపై అధికారులు, కార్యకర్తలతో మంతనాలు జరిపారు. కళ్యాణదుర్గం పరిధిలో పంచాయతీల వారీగా ఓటర్ లిస్టులను మంత్రి పరిశీలించారు. ఒక్కో ఓటుకు రూ.వెయ్యి పంపిణీ చేయాలని మంత్రి ఉషశ్రీ చరణ్ సూచించారు. డబ్బు చేరిందో లేదో ఓటర్లకు ఫోన్ చేసి చెక్ చేసుకోవాలంటూ సలహా ఇచ్చారు.
పశ్చిమ రాయలసీమ (కడప-అనంతపురం-కర్నూలు) పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు సహా ఉమ్మడి కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు సోమవారం జరగనున్నాయి. పట్టభద్రులు, ఉపాధ్యాయులు కీలక తీర్పు ఇవ్వనున్నారు. ఏడాదిలో రానున్న అసెంబ్లీ సాధారణ ఎన్నికల ముందు జరుగుతున్న సమరం కావడంతో తీర్పు ఎలా ఉండబోతుందో..? అని ఎదురు చూస్తున్నారు. పోలింగ్‌కు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు.
పట్టభద్రులు ఎమ్మెల్సీ స్థానానికి అధికార పార్టీ మద్దతుతో అనంతపురం జిల్లాకు చెందిన వెన్నపూస రవీంద్రారెడ్డి, టీడీపీ మద్దతులో కడప జిల్లా పులివెందుల పట్టణానికి చెందిన భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, పీడీఎఫ్, వామపక్షాల మద్దతులో పోతుల నాగరాజు సహా 49 మంది బరిలో ఉన్నారు. ఇంతలోనే ఇక్కడ అక్రమాలు జరుగుతున్నాయని.. బోగస్ ఓట్లు పెరిగిపోయాయని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఇంతలోనే మంత్రి అడ్డంగా దొరికిపోవడం.. సంచలనంగా మారింది.
Kind attention @ECISVEEP..this YCP karyakartha was caught distributing money to voters in Vizag. Earlier illegal votes were added, the proofs of which will be shared with the commission soon. These are signs of desperation for the ruling party as it stares at defeat.(2/2)
— N Chandrababu Naidu (@ncbn) March 12, 2023