• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

జగన్ కి పండగే… ఇక ఇంట్లోంచి ఓట్లేయొచ్చంట

ఎలక్షన్ కమీషన్ సరికొత్త ప్రయోగం ... ఏపీలో వస్తే ప్రమాదమే

NA bureau by NA bureau
March 12, 2023
in Around The World, Politics, Top Stories, Trending
0
jagan

jagan

0
SHARES
1.5k
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

తొందరలో జరగబోయే కర్నాటక అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ఎన్నికల కమీషన్ కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో వృద్ధులు, వికలాంగులు ఆన్ లైన్లోనే ఓట్లేసే విధానాన్ని ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు చీఫ్ ఎలక్షన్ కమీషనర్ రాజీవ్ కుమార్ మీడియాతో చెప్పారు. వివిధ కారణాలతో పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓట్లేయలేని వాళ్ళకోసం ఆన్ లైన్ ఓటింగ్ విదానాన్ని అమల్లోకి తీసుకురావాలని జనాలు ఎప్పటినుండో డిమాండ్ చేస్తున్నారు.

వివిధ వర్గాల నుండి వినిపిస్తున్న డిమాండ్లను కమీషన్ దృష్టిలో పెట్టుకున్నట్లుంది. అందుకనే మేనెలలో జరగబోతున్న కర్నాటక అసెంబ్లీ ఎన్నికలను ప్రయోగానికి  వేదికగా చేసుకున్నది. అయితే ఏ పద్దతిలో ఓట్లేయాలి, అందుకు అందుబాటులోకి తీసుకురాబోతున్న సాంకేతికత ఏమిటనేది విషయాలను మాత్రం చీఫ్ కమీషనర్ చెప్పలేదు. కమీషన్ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 80 మందికి పైగా వికలాంగులున్నారట. అలాగే 100 ఏళ్ళు పైబడిన ఓటర్లు 17 వేలమంది ఉన్నట్లు చెప్పారు.

ఇక్కడే చీఫ్ కమీషనర్ చెప్పినలెక్కల్లో తేడా కనిపిస్తోంది. చీఫ్ కమీషనర్ వికలాంగులు, వృద్ధుల అంకెలను తారుమారు చేసి చెప్పారా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. సరే వికలాంగులు, వృద్ధుల సంఖ్య ఎంతన్నది పక్కనపెట్టేస్తే వీళ్ళంతా తమ ఇళ్ళల్లో నుండే ఓట్లేయచ్చన్నారు. ఇలాంటి వాళ్ళు తమ ఓట్లను నమోదు చేసుకునేందుకు ఫారం 12డి ని అందుబాటులోకి తేబోతున్నట్లు చెప్పారు. బహుశా ఈ ఫారం 12డి ఫిలప్ చేసి ముందుగానే కమీషన్ కార్యాలయంలో ఇవ్వాలేమో.

అప్పుడు కమీషన్ దరఖాస్తుదారులను నిర్ధారణ చేసుకుని ఆన్ లైన్లో ఓటింగ్ కు అవసరమైన సాంకేతికతను అందిస్తుందేమో చూడాలి. ఆన్ లైన్లో ఓటింగ్ అంటే ముందు ఇంటర్నెట్ ఉండాలి. కంప్యూటర్, ల్యాప్ టాప్, మొబైల్ లాంటి వాటికి ఇంటర్నెట్ అనుసంధానం సక్రమంగా ఉండాలి. అన్నీ సరిగా ఉంటేనే ఆన్ లైన్లో ఓటింగ్ అనేది సజావుగా సక్సెస్ అవుతుంది. సరే ఏదైనా ప్రయోగదశలో కొన్ని సమస్యలు రావటం తర్వాత వాటిని అధిగమించటం మమూలే కదా. ఏదేమైనా ఆన్ లైన్లో ఓటింగ్ నిర్వహించటం, ప్రక్రియను  అమల్లోకి తీసుకురావటమే గొప్ప విషయమనే చెప్పాలి. మరి కర్నాటక ప్రయోగం ఏమవుతుందో చూడాలి.

అంతా బాగుంది గానీ ఇంత కట్టడి మధ్యనే దొంగ ఓట్లను విశ్రుంఖలంగా వాడుతున్న జగన్ ఇక ఇంట్లోంచి ఓటేయొచ్చు అనే స్కీమ్ ఏపీలో తెస్తే అతన్ని అడ్డుకోవడం దాదాపు అసాధ్యం అని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

Tags: fake votesJaganvote from homeYSRCP
Previous Post

కవిత ఈడీ విచారణ – నోట్ దిస్ పాయింట్

Next Post

చంద్ర‌బాబు చెప్పింది అక్ష‌రాలా నిజం.. మంత్రులే ఎన్నిక‌ల్లో డ‌బ్బులు పంచుతున్నారే!

Related Posts

tdp and ycp logos
Politics

టీడీపీ నాశ‌నం కోరుకుని.. తానే నాశ‌నం అవుతున్న వైసీపీ!?

March 23, 2023
sajjala ramakrishna reddy
Politics

స‌జ్జ‌ల వీటికి స‌మాధానం చెప్ప‌గ‌ల‌రా?

March 23, 2023
jagan lost people vote
Politics

వైసీపీలో వారిపై  అనుమానం చూపులు

March 23, 2023
manchu mohanbabu
Andhra

నిజ‌మేనా… మోహ‌న్‌బాబు మాట నొమ్మొచ్చా…!

March 23, 2023
panchumarthi anuradha
Politics

Big News : వైసీపీకి షాక్ ఇచ్చిన రెబెల్స్ – పంచుమర్తి అనురాధ గెలుపు

March 23, 2023
kcr, kavita
Telangana

కేసీఆర్ కుటుంబంలో టెన్షన్ పెరిగిపోతోందా ?

March 23, 2023
Load More
Next Post
andhrapradesh map

చంద్ర‌బాబు చెప్పింది అక్ష‌రాలా నిజం.. మంత్రులే ఎన్నిక‌ల్లో డ‌బ్బులు పంచుతున్నారే!

Latest News

  • టీడీపీ నాశ‌నం కోరుకుని.. తానే నాశ‌నం అవుతున్న వైసీపీ!?
  • స‌జ్జ‌ల వీటికి స‌మాధానం చెప్ప‌గ‌ల‌రా?
  • వైసీపీలో వారిపై  అనుమానం చూపులు
  • ‘తానా’ ఫౌండేషన్  కార్య‌ద‌ర్శి ‘వ‌ల్లేప‌ల్లి శ‌శికాంత్‌కు’ `విశిష్ట ఉగాది` పుర‌స్కారం
  • నిజ‌మేనా… మోహ‌న్‌బాబు మాట నొమ్మొచ్చా…!
  • Big News : వైసీపీకి షాక్ ఇచ్చిన రెబెల్స్ – పంచుమర్తి అనురాధ గెలుపు
  • కేసీఆర్ కుటుంబంలో టెన్షన్ పెరిగిపోతోందా ?
  • ‘భగత్ సింగ్’ తన తండ్రికి రాసిన చివరి లేఖ!
  • విశాఖలో విషాదం
  • కేటీఆర్ బుక్కయ్యాడు… ఆ ట్వీట్ వల్లేనా??
  • ఒక్కటి తేడా వచ్చినా జగన్ కు షాకే!
  • మీ టైం అస్స‌లేం బాలేదు!:  తెలంగాణ పంచాంగంలో కేసీఆర్‌కు షాక్‌
  • ఆ ఇద్దరికీ విడాకులు గ్యారంటీ !
  • పండుగ పూట కేటీఆర్ నుంచి అలాంటి ట్వీట్ వచ్చిందంటే?
  • మొన్న రేవంత్.. నిన్న బండి.. సిట్ సేమ్ సీన్

Most Read

పవన్ ఈ స్పీడేంటి సామీ !

ఉగాది ప్రత్యేకం: ఈ ఏడాది రాశి ఫలాలు ఎలా ఉన్నాయి?

పవన్‌తో చేశాడు.. అభిమానికి పడిపోయాడు

తెల్లవారుజామునే రామోజీరావు కి షాక్

ఈ షాక్‌కు ఖంగుతిన్న పురంధేశ్వ‌రి…!

సీదిరి అప్పలరాజు మాకొద్దు… బ్యాలెట్ బాక్సులో లేఖలు !!

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra