అవసరం లేని కక్షలు.. కార్పణ్యాలతో ఒరిగేదేమీ ఉండదన్నది మర్చిపోకూడదు. ఆ విషయాన్ని వదిలేసిన దేశాలు ఎలాంటి దారుణ పరిస్థితుల్లోకి చిక్కుకుంటాయన్న దానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది పాకిస్తాన్ దేశం. మన దేశం నుంచి విడిపోయిన క్షణం నుంచి.. బారతదేశాన్ని ఏదో చేయాలని తపించే ఆ దేశం.. తనను తాను మరిచి.. భారత్ ను దెబ్బ తీయటమే బతుకుగా మారింది.
చివరకు ఆ దేశం.. పాలకులు చేసిన తప్పులతో ఇప్పుడు దారుణ పరిస్థితుల్లో చిక్కుకుంది. పాకిస్థాన్ లో ఆర్థిక సంక్షోభం ఎంత ఎక్కువగా ఉందన్నది తెలిసిందే. దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ తీవ్రమైన పొదుపు చర్యల్ని పాటించేవారు. తమను ఆదుకోవాలని ప్రపంచ దేశాల్ని అభ్యర్థిస్తున్న పాకిస్థాన్ లో పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే.. ప్రభుత్వాన్ని నడపలేని స్థితికి చేరుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేక.. వారికిచ్చే వేతనాల్లో కోత పెడుతోంది.
పరిస్థితిని మెరుగు పర్చుకునేందుకు ఆస్తుల్ని అమ్మకానికి పెట్టింది. తాజాగా అమెరికాలోని పాకిస్థాన్ ఎంబసీలో ఉన్న ఆస్తుల్ని అమ్మకానికి పెట్టే వరకు వెళ్లింది. వాషింగ్టన్ లో ఉన్న ఈ ఆస్తుల్ని కొనేందుకు కొన్ని రియల్ సంస్థలు ఆసక్తి చూపుతున్నట్లుగా చెబుతున్నారు. మొత్తం మూడు సంస్థలు బిడ్ లు వేయగా.. అందులో ఒకటి భారత్ కు చెందిన కంపెనీ ఉండటం గమనార్హం. జువిష్ కు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ 6.8 మిలియన్ డాలర్ల మొత్తానికి తన బిడ్ ను వేయగా.. భారత్ కు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ అత్యధిక బిడ్ వేసిన రెండో సంస్థగా నిలిచింది.
మూడో స్థానంలో పాకిస్థాన్ కు చెందిన ఒక రియల్ ఎస్టేట్ సంస్థ నిలిచింది. ఇంతకీ పాక్ ప్రభుత్వం అమ్మకానికి పెట్టిన ఆస్తుల మాటేమిటంటే.. వాషింగ్టన్ లో పాక్ రాయబార కార్యాలయానికి రెండు ఉన్నాయి. వాటిల్లో ఒకటి పాతది కాగా.. ఇంకొకటి కొత్తది.
వాషింగ్టన్ లోని ఆర్ స్ట్రీట్ లో 1953-56 మధ్యలో అప్పటి పాకిస్థాన్ రాయబారి కొనుగోలు చేసిన భవనంలో 2000 వరకు కార్యకలాపాల్ని నిర్వహించారు. తర్వాత కొత్త భవనంలోకి మారారు. తాజాగా ఎదురైనతీవ్ర ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో తన ఆస్తుల్లో ఒకదాన్ని అమ్మాకానికి పెట్టినట్లుగా చెబుతున్నారు. ఇప్పటికైనా పాకస్థాన్ కళ్లు తెరుస్తుందా? లేదంటే.. ఇప్పటికి కుళ్లు.. కుతంత్రాలతోనే కాలం గడుపుతుందా?
India's Yana Mir explains a Pakistani journalist why Pakistan should stop dreaming of capturing Kashmir
Last few seconds are epic! pic.twitter.com/GyVJ0bZ8Bt
— Mahesh Vikram Hegde ????????( Modi Ka Parivar ) (@mvmeet) December 18, 2022