చాలామంది ఏపీ ప్రజలు ఏమనుకుంటున్నారంటే… చంద్రబాబు కి పేరు వస్తుందని, అది రాకుండా అడ్డుకోవడానికి జగన్ రాజధానిని విశాఖకు తరలిస్తున్నాడు అనుకుంటున్నారు.
మరికొందరు… అమరావతిలో అక్రమాలు చేయడానికి వీలులేని టెక్నికల్ మోడ్రన్ సిటీ కాబట్టి తను, తన వంగమాగదులు మేయడానికి వైజాగ్ కి వెళ్తున్నారని అనుకునే వాళ్లూ ఉన్నారు.
అయితే, ప్రముఖ విశ్లేషకులు ఏం చెబుతున్నారంటే… జగన్ నవరత్నాలకు డబ్బులు కావాలి. కొత్తగా జగన్ డబ్బులు సృష్టించలేకపోతున్నాడు. ఖాళీ ఖజానాతో చంద్రబాబు ఐదేళ్లు ఎలా నడిపాడో ఏమో… మనకెందుకీ కష్టాలు… అసలు రాజధానికి ఒకపైసా పెట్టకుండా ఉండాలంటే ఏం చేయాలని జగన్ ఆలోచించాడు…
అందులో భాగంగా న్యాయనిపుణులు ఇచ్చిన సలహానే వైజాగ్ కి రాజధాని తరలింపు- మూడురాజధానులు. వారి ప్రకారం… రాజధాని తరలింపు సాధ్యం కాదు. ఇది కచ్చితంగా కోర్టులో కొట్టివేయబడుతుంది. అదంతా తేలేలోపు నాలుగైదేళ్లు గడుస్తాయి కాబట్టి రాజధాని తరలిస్తాం… అని చెబితే రాజధాని నిర్మాణం ఆపొచ్చు, తరలింపు ఎలాగూ జరగదు. రాజధానికి డబ్బులు ఖర్చుపెట్టాల్సిన డబ్బులు మిగిలిపోతే అవన్నీ నవరత్నాలకు వాడుకోవచ్చని సలహా ఇచ్చారట. అదీ కథ.
అయితే జగన్ రాజకీయం జనాలకు త్వరగా అర్థమైంది. ఎంత బాగా అర్థమైంది అంటే… వైసీపీ ఆఫీసుపై టీడీపీ జెండా ఎగరేంతగా అర్థమైంది.