రాత్రి బస చేసిన కందుకూరు నుండి ఉదయం తొమ్మిది గంటలకు బయలుదేరి…కొండ ముడుసు పాలెం,
మోపాడు,మాచవరం… మీదుగా గుడ్లూరు చేరుకున్నాము. మధ్యాహ్న భోజనం మోపాడు లో ఏర్పాటు చేశారు.
ఈరోజు పాదయాత్ర మార్గంలో సమీప గ్రామాలైన…గుల్లపాలెం,దారకాని పాడు,రాళ్ళపాడు,కొత్త పేట,
బసి రెడ్డి పాలెం గ్రామాల ప్రజలు కూడా ప్రధాన రహదారి మీద… వేలాదిగా చేరుకొని మహా పాదయాత్రకు స్వాగతం పలికారు.
ఒక మహాయజ్ఞంలో సాగుతున్న పాదయాత్ర కు ఎంతోమంది లక్షలాది రూపాయలు విరాళం ఇవ్వటం ప్రతి రోజూ చూస్తున్నాం.
అయితే ఈ రోజు మోపాడు లో సత్యవతి గారు అనే ఒక రైతు కూలీ, తన స్తోమతకు తగినట్టుగా పది రూపాయల విరాళాన్ని దేవుని రథం మీద ఉన్న హుండీ లో వేయడం అద్భుతమైన విషయం.
ఈ రోజంతా పాదయాత్రలో కందుకూరి మాజీ శాసనసభ్యులు దివి శివరాం గారు మరియు వారి సతీమణి అడుగడుగున అందర్నీ ప్రోత్సహిస్తూ… కార్యక్రమాన్ని నడిపించారు.
తన స్వగ్రామమైన మోపాడు మీదుగా సాగుతున్న మహా పాదయాత్ర లో సిపిఎం సీనియర్ నాయకులు బివి రాఘవులు గారు పాల్గొన్నారు.
ఈరోజు రాత్రి బస చేసిన గుండ్లురు కు చాలా చరిత్ర ఉన్నది. మహాభారతాన్ని తెలుగులోకి అనువదించిన ఎర్రనా మాత్యుడు ఈ గ్రామం వాడే. ఆంధ్ర మహాభారతంలోని మొదటి రెండున్నర పర్వాలను ఎర్రన్న ఈ గ్రామంలోనే రచించాడని చరిత్రకారులు చెబుతున్నారు.
గుండ్లురు చేరుకున్న మహ పాదయాత్ర లో సిపిఎం కార్యకర్తలు మరియు బీజేపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు.
కొలికపుడి శ్రీనివాస రావు