ఏపీలో రాజకీయం కలకలం. తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు, ఫైర్ బ్రాండ్ లీడర్ అచ్చెన్నాయుడును చిన్న బెదిరింపు కేసులో మరోసారి అరెస్టు చేసి జైలుకు పంపారు పోలీసులు. ఒకవైపు దాడులు చేసి టీడీపీ నేతల తలలు పగలగొడుతున్న వారిని కనీసం అరెస్టు చేయలేని పనితనం ఒకవైపు చూపుతున్న పోలీసులు… వైసీపీ కార్యకర్త మీద ఈగ వాలినా మెరుపు వేగంతో స్పందిస్తున్నారు. ఆఘమేఘాలు మీద అరెస్టులు, కోర్టుకు పంపడాలు జరిగిపోతున్నాయి. తాజాగా అచ్చెన్నకు కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది.
ఎన్నికలను తమకు ఇష్టం లేకుండా జరుగుతున్నాయన్న కోపంతో స్వతంత్ర సంస్థ అయిన ఎస్ఈసీని ఏమీ చేయలేక పోతున్న ప్రభుత్వం తెలుగుదేశం నేతల మీద కక్షతీర్చుకోవడానికి సర్వశక్తులు అడ్డుతోంది. పాలనతో ప్రజల మనసు గెలుచుకోకుండా పోలీస్ పవర్, పొలిటికల్ పవర్ తో రోజులు దొబ్బుకుంటూ రావడానికి ప్రయత్నం చేస్తోంది.
వైసీపీకి ప్రజాస్వామ్యం అన్నా, ఎన్నికలు అన్నా వెన్నులో వణుకుపుడుతోందని… ప్రజస్వామ్య పద్ధతిలో టీడీపీని ఎదుర్కోవడం ఎన్నటికీ జగన్ తరం కాదని తెలుగుదేశం నాయకులు విమర్శిస్తున్నారు. పాలన చేతగాని ప్రభుత్వ అధినేతగా జగన్ చరిత్రలో మిగిలిపోయారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
రాష్ట్రాన్ని రావణకాష్టం చేస్తూ పరిశ్రమలను తరిమేస్తూ యువత భవిష్యత్తును అన్యాయం చేస్తున్న వైసీపీ అధినేత జగన్ బడ్జెట్ లో ఏపీకి ఒక్క రూపాయి సాధించలేక దానిని కవర్ చేసుకోవడానికి అది మీడియాలో చర్చకు రాకుండా దాడులు, అరెస్టులకు పాల్పడుతున్నారని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది.