అధికార వైసీపీ వివాదాలకు దూరంగా ఉండలేదు ! వరుస ఘటనలు ఆ పార్టీని అప్రతిష్ట పాల్జేస్తున్నాయి. ఎంపీ గోరంట్ల మాధవ్ (నియోజకవర్గం : హిందూపురం ) ఇష్యూ మరోసారి తెరపైకి వచ్చింది. నిన్నటివేళ పోలీసు నివేదిక వచ్చింది. ఆ నివేదిక ప్రకారం ఎంపీ విషయమై సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ఫేక్ అని ఆధారం లేకుండా పోలీసులు తేల్చేశారు
ఆధార రహితంగా పోలీసు నోటి నుంచి వచ్చిన మాటతో మాధవ్ మళ్లీ రెచ్చిపోయారు. నోటికి వచ్చిన విధంగా బూతులు తిట్టారు. విపక్ష నేతనూ ఇంకా ఇతర మీడియా సంస్థల నిర్వాహకులనూ నోటికి వచ్చిన విధంగా తిట్టారు. ఓ ప్రజాప్రతినిధి స్థాయిలో మాట్లాడే మాటలేనా అవి అని అనిపించేంత స్థాయిలో తిట్టారు. భాష వాడారు. అయినా కూడా ఆ మాటలను కానీ ఆ బూతులను కానీ ఎవ్వరూ ఆపడం లేదు ఆ పార్టీలో .. !
మరోవైపు ఈ ఘటనకు సంబంధించి ఎంపీ కి సంబంధించి వెలుగులోకి వచ్చింది మార్ఫింగ్ వీడియో అని తేల్చేశారు పోలీసు ఉన్నతాధికారులు. బాధితులెవ్వరూ ఫిర్యాదు ఇవ్వలేదు కాబట్టి అది ఫేక్ అట. ఈయన అనంత పురం ఎస్పీ. అంటే ఇప్పుడు వెలుగులోకి వచ్చినవి, ఇకపై వెలుగు చూసేవి అన్నీ కూడా మేం అబద్దాలే అని నిర్థారణ చేసుకోవాలా అని విపక్షాలు అంటున్నాయి.
పోలీసుల తీరు చూశాక… ఎవరైనా ముందుకు వచ్చి ఫిర్యాదు చేసే ధైర్యం చేస్తారా? వీడియో వెలుగులోకి వచ్చినప్పుడే బాధిత మహిళతో ఎంపీ రాయబారాలు నడిపేరని ఓ వార్త విపక్షం లో ఉన్న నాయకులు మీడియాకు వెల్లడించారు. పోనీ అవన్నీ పక్కన పెట్టి ఆలోచిద్దాం అంటే ఎంపీ భాష ఏమయినా బాగుందా అంటే అబ్బో… అది చెప్పలేం.
మరోవైపు పోలీసుల వ్యవహారశైలి ఏపీలో నవ్వుల పాలవుతోంది. అస్సలు ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపకుండానే అది ఫేక్ అని ఎలా తేల్చేస్తారన్న అనుమానాలూ కొన్ని ప్రధాన మీడియాలో వ్యక్తం అయ్యాయి. పోలీసులు, వైసీపీ నేతల మాటలు జనం నమ్మకపోగా…అసహ్యించుకుంటున్నారు.
ఈ వివాదంలో గతం నుంచి ఇప్పటి వరకూ వైసీపీ ధోరణిపై పలు అనుమానాలు ఉన్నాయి. వాటిని కొనసాగిస్తున్న విధంగానే వైసీపీ ఉన్నత స్థాయి నాయకత్వం ప్రవర్తన ఉంటుంది. ముఖ్యంగా ఎంపీ మాధవ్ మొదట్నుంచి వివాదాలకు తావిస్తున్న విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఆయన లోక్ సభలో క్రియాశీలక పాత్ర పోషించలేకపోగా, కనీస స్థాయిలో కూడా ప్రశ్నలు అడగలేకపోతున్నారు అన్నవాదన కూడా ఉంది.
ఓ ఎంపీ స్ధాయివ్యక్తి ప్రజా సమస్యలపై పోరు జరపకుండా హాయిగా తప్పించుకుని, అనవసర వ్యాఖ్యలతో, వివాదాలతో కాలం వెళ్లదీయడం అన్నది ఏం బాలేదని, రాష్ట్రానికి సంబంధించి ప్రయోజనాల సాధనలో ఇంతవరకూ ఆ ఎంపీ చేసిన కృషి ఏమీ లేదని తేలిపోయింది. అంటే రాజకీయంగా యుద్ధంలో గెలిచినంత మాత్రాన ఓ నాయకుడు సమర్థుడు అయిపోరని, దేశ రాజధాని ఆ ప్రాంత సమస్యలపై ఎరుగని పోరాటం చేసినప్పుడే ఫలితాలుంటాయని చెబుతున్నారు విపక్ష నేతలు.