మాట్లాడే ముందు కాస్త ఆలోచించాలి. ముఖ్యంగా సజ్జల రామకృష్ణా రెడ్డి ఆలోచిస్తే బెటర్. ఏది చేసినా బీసీల కోసమే అని చెప్పడంలో ఏమయినా అర్థం ఉందా ? ఒక్కసారి ఆలోచించాలి కదా ! చరిత్ర చదవకుండా ఎలా మాట్లాడతారు వైసీపీ వాళ్లు. మనుపటిలా మీ అబద్ధాలను నమ్మడానికి జనం సిద్ధంగా లేరు కదా.
రాష్ట్రంలో ఎంత మంది బీసీ నేతలు లేరు..? వాళ్లకు దక్కని గౌరవం ఆర్.కృష్ణయ్యకు ఎందుకు దక్కింది? అంటే ఆయన చెల్లెల్లు పార్టీకి రేపటి వేళ తెలంగాణ వాకిట సాయం చేస్తారనా ? ఇదే మాట సోషల్ మీడియాలో పదే పదే చర్చకు వస్తున్నది. ఎవరు ఔనన్నా కాదన్నా ఇదే నిజం కూడా ! కానీ సజ్జల రామకృష్ణా రెడ్డి అస్సలు లాజిక్ లేకుండా బీసీల కోసమే పుట్టిన పార్టీ వైసీపీ అన్న విధంగా మాట్లాడుతున్నారు.
బడుగు, బలహీన వర్గాల ఉన్నతే ధ్యేయంగా పదవుల పంపకం ఉంటే ఎవ్వరూ కాదనరు. కానీ పదవులన్నీ ప్రాంతేతర వ్యక్తులకు అప్పగించడంలోనే అభ్యంతరాలు ఉన్నాయి. ఓ బీసీ ముఖ్యమంత్రి ఉన్నా కూడా బీసీలకు ఇన్ని పదవులు రావు అని సజ్జల చెబుతున్నారు.ఇది మరీ విడ్డూరం !
గతంలో బీసీలకే కాదు ఎస్సీలకూ ఎస్టీలకూ ఉన్నత పదవులు ఇచ్చి గౌరవించిన ఘనత తెలుగుదేశానికి కానీ ఉంది. తెలుగుదేశంలో కీలక పదవులు బీసీలకే దక్కేవి. టీటీడీ ఛైర్మన్ కూడా బీసీలే అయ్యేవారు. కానీ వైఎస్ ఫ్యామిలీ అధికారంలోకి వస్తే మాత్రం టీటీడీ రెడ్లు, క్రిస్టియన్ల చేతిలోకి పోతుంది. మరి ఇక్కడ బీసీలు గుర్తుకురారా? ఆ వెంకటేశ్వర స్వామి వాకిలి తెరిచి తొలి దర్శనం చేసుకునేది బీసీయే. అలాంటి చోట రెడ్ల ఆధిపత్యం ఏంటో.
ఆర్.కృష్ణయ్య అనే వ్యక్తి పదవులు దక్కించుకోవడమే ధ్యేయంగా గతంలో పనిచేశారని, బీసీల సంక్షేమం కోసం ఆయనేదో కృషి చేశారు అని చెప్పడం చాలా తప్పు అని సోషల్ మీడియాలో ఉన్న తెలంగాణ వాదులు, తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తులు అంటున్నారు.
గతంలో ఆర్.కృష్ణయ్య మాదిరిగానే మందకృష్ణ మాదిగ కూడా మానవ హక్కుల కోసం కాస్తో కూస్తో పోరాటం చేసిన దాఖలాలు ఉన్నాయి అని, పొలిటికల్ లాబీయింగ్ లో ఆయన సక్సెస్ కాలేపోయారు అని, అదే కృష్ణయ్యకు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులను సైతం మేనేజ్ చేయడం సులువుగా వచ్చన్నది వారి విమర్శ లేదా స్థిర అభిప్రాయం.
ఏదేమయినప్పటికీ ఎప్పటి నుంచో రాజ్యసభ కు వెళ్లాలని యోచిస్తున్న కిల్లి కృపారాణి లాంటి లీడర్లకు ఈ సారి నిరాశే ! ఇదే సమయంలో రామకృష్ణా రెడ్డి లాంటి పాత్రికేయులు కేవలం విధేయతలో భాగంగా మాట్లాడుతూ దీన్నొక చరిత్ర అని చెప్పడం కూడా సబబు కాదు అన్న వాదన కూడా సోషల్ మీడియా నుంచి వినవస్తోంది.