ప్రపంచంలో ఎక్కడా జరగనది ఏపీలో జరగడం సర్వ సాధారణం.
2014లో టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకుంది.
ఆ పొత్తు అయితే, టీడీపీకి ఉపయోగపడాలి. లేదా జనసేనకు ఉపయోగపడాలి.
అలా జరిగితే అది ఏపీ ఎందుకు అవుతుంది. భిన్నంగా జరగడమే ఏపీ స్పెషల్.
అయితే, ఉపయోగపడినా అది స్వల్పమే అని అప్పటి పంచాయతీ ఎన్నికల ఫలితాలు తేల్చిచెప్పాయి.
2014లో జనసేన-టీడీపీ పెట్టుకున్న పొత్తు వారిద్దరి కంటే 2019లో జగన్ కి బాగా గట్టిగా ఉపయోగపడింది.
ఏపీలో నిజం చెప్పి ఎవరినీ నమ్మించలేం. కానీ అబద్ధాన్ని చెప్పి ఎంతమందిని అయినా నమ్మించవచ్చు.
2019లో జరిగింది ఇదే.
ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా జగన్ -పీకే కలిసి వేసిన మహత్తరమైన ప్లానే ఇది.
జనసేన పూర్తిగా విడిపోయి వేరే పార్టీలతో కలిసినా … పవన్ టీడీపీ మనిషే అని ప్రచారం చేయడం ద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా పన్నిన పన్నాగం ఇది. అబద్ధాన్ని హాయిగా వినే ఏపీ ప్రజలు దీనిని బాగా నమ్మేశారు. అందుకే జగన్ కి ఓటేశారు.
జనసేనకు టీడీపీకి సంబంధం లేదని జగన్ కి కూడా తెలుసు. కానీ అలా చెబితే తమకు లాభం కాబట్టి వైసీపీ ఆ అబద్ధాన్నే ప్రచారం చేస్తోంది.
తాజాగా జనసేన రాజకీయాల్లో యాక్టివ్ అవడం మొదలుపెట్టడంతో… మళ్లీ ఈ అబద్ధపు ప్రచారాన్ని వైసీపీ గట్టిగా మొదలుపెట్టింది.
వైసీపీ వ్యూహాత్మక చేస్తున్న ప్రచారం మూడు అంచెల్లో జరుగుతోంది.
1. జనసేన టీడీపీ రహస్య స్నేహితులు అని అబద్ధాన్ని ప్రచారం చేయడం.
2. టీడీపీ పొత్తులేకుండా ఎన్నికల్లో గెలవలేదు అని టీడీపీ వారిని మానిసకంగా ప్రిపేర్ చేసిన జనసేన వైపు మొగ్గేలా చేయడం.
3. టీడీపీని బలహీనంగా చూపించడం ద్వారా జనసేనలో రాజకీయ ఆశలు రేపి ఆ పార్టీని బలపడేలా చేసి కాపు ఓటును బాబుకు వెళ్లకుండా కార్నర్ చేయడం.
దీని వెనుక మరో కుట్ర కూడా ఉంది. జనసేన వాపును బలుపులా చిత్రీకరించి ఆ పార్టీని పెంచడం ద్వారా టీడీపీని ఎక్కువ సీట్లు జనసేన డిమాండ్ చేసేలా ప్రయత్నించడం ద్వారా ఎలాగైనా ఈ పొత్తు జరగకుండా చూసి ఇరు పార్టీలను దెబ్బతీయడం అనే బృహత్తర వ్యూహం ఇది. మరి తెలుగుదేశం పార్టీ ఈ ఎత్తుకు పైఎత్తు వేయగలదా? ఎపుడు వేస్తుంది? కాలం సమాధానం చెప్పాలి.