ఏపీ, తెలంగాణ, ఢిల్లీ…ఇలా ఎక్కడ చూసినా ఇప్పుడు వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియోనే హాట్ టాపిక్. వైసీపీ లో కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు శృంగార పురుషులని, అయితే, అటువంటి వారిని శిక్షించాల్సిన జగన్…వారికి మరింత పెద్ద పదవులు కట్టబెట్టి తప్పుడు సంకేతాలిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. గతంలో అవంతి అరగంట…అంబటి గంట…గోరంట్ల నిలబడిన గంట…అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ‘వైఎస్సార్ సీపీ’కి టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కొత్త భాష్యం చెప్పారు. YSRCP అంటే ‘యువజన శృంగార రసిక చిలిపి పార్టీ’ అంటూ బుద్ధా సెటైర్లు వేశారు. అంతేకాదు, ఆ పేరును గతంలో అవంతి, అంబటి సార్థకం చేశారని, ఆ కోవలోనే గోరంట్ల మాధవ్ మరో ట్రెండ్ సెట్టర్ అని బుద్ధా చురకలంటించారు. అవంతి అరగంట సరసం, అంబటి గంట విరహం ఆడియోలు రిలీజ్ అయ్యాయని, కానీ, వారిపై చర్యలు తీసుకోవాల్సిన జగన్ అంబటికి మంత్రి పదవి కట్టబెట్టారని బుద్ధా దుయ్యబట్టారు.
ఇలాంటి చిలిపి ఆడియోలు, వీడియోలు రిలీజ్ చేసిన వారినే జగన్ గుర్తిస్తున్నారని గోరంట్ల ఏకంగా న్యూడ్ వీడియో వదిలారని పంచ్ లు వేశారు. ఇక, గోరంట్లకు కూడా అంబటిలాగా జగన్ మంత్రి పదవిచ్చి గౌరవిస్తారేమోనంటూ చురకలంటించారు. కాగా, ఈ వ్యవహారం నేపథ్యంలో జగన్ పై టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు విమర్శలు గుప్పించారు. వైసీపీ నేతలు మదమెక్కిన ఆంబోతుల్లా ఊరిమీద పడి మహిళల మానప్రాణాలు తీస్తున్నారని, కానీ, వారిపై జగన్ కనీస చర్యలు కూడా తీసుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహిళలపై లైంగికదాడులకు పాల్పడుతున్నవారికి జగన్ మంత్రి పదవులిచ్చి సత్కరిస్తున్నారని ఎద్దేవా చేశారు. వైకామకేయుల్ని ఊరి మీదకి వదిలి దిక్కులేని దిశ చట్టం తెచ్చారని, ఇటువంటి సీఎం పాలనలో మహిళలకు రక్షణ ఎక్కడుంటుందని విమర్శించారు.