వైసీపీ నేత, కృష్ణా జిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తాజాగా అరెస్ట్ అయ్యారు. గన్నవరం దగ్గరలో పోలీసులు వంశీని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం గన్నవరం పోలీస్ స్టేషన్ కు తరలించారు. టీడీపీ తరఫున రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వల్లభనేని వంశీ.. ఆ తర్వాత వైసీపీలోకి జంప్ అయ్యారు. అక్కడితో ఆగకుండా టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన సతీమణి నారా భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.
అలాగే గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి చేయించారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు అడ్డంగా ఇరుక్కున్నారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత గన్నవరం వదిలి వెళ్లిపోయిన వంశీ.. కాన్నాళ్లు హైదరబాద్ లో తలదాచుకున్నారు. వంశీని అరెస్ట్ చేసేందుకు మూడు బృందాలుగా పోలీసులు హైదరాబాద్ వెళ్లగా.. అక్కడ ఆయన లేరు. ఈ క్రమంలోనే వంశీ అమెరికాకు వెళ్లిపోయినట్లు వార్తలు వచ్చాయి.
కానీ ఆయన అమెరికా వెళ్లలేదు. హైదరాబాద్ నుంచి వేర్వేరు కార్లలో గన్నవరం వస్తుండగా.. ఆయన ఆచూకీ తెలుసుకున్న పోలీసులు వాహనాన్ని అనుసరించి అదుపులోకి తీసుకున్నారు. గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో ఏ71గా వల్లభనేని వంశీ ఉన్నారు. ఇప్పటికే 18 మందిని ఈ కేసులో అరెస్ట్ చేశారు. ఇక వంశీ ప్రోద్బలంతోనే దాడి జరిగిందని పోలీసులు గుర్తించారు.