20 రూపాయల టోల్ కోసం టోల్ ప్లాజా వద్ద అల్లరి చేసి, గేటు తోసేసి సిబ్బందితో గొడవ పడి… ఒకర్ని కొట్టిన వైసీపీ మహిళా నేత అరాచకాన్ని నిన్నటి నుంచి దేశమంతా చూస్తోంది. ఏ సోషల్ మీడియాలో చూసినా అదే గొడవ. ఏపీ అధికార పార్టీ పరువును దేశ వ్యాప్తంగా గంగలో కలిసింది. రాష్ట్రంలో వైసీపీ నేతలు ఎలా వ్యవహరిస్తారో అందరికీ తెలిసిపోయింది. ఆమె వ్యవహార శైలి ఏపీ మహిళలకు కూడా తలవొంపులు తెచ్చింది.
ఆ వీడియో మీరు కూడా ఒకసారి చూడండి. జాతీయ స్థాయిలో ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ ఆమె అరాచకాన్ని దేశ ప్రజల ముందు పెట్టింది. ఆ వీడియో కింద ప్రతి ఒక్కరు వైసీపీ నేత రేవతి వ్యవహార శైలిని తీవ్రంగా తప్పుపడుతున్నారు. సుమారు 2400 మంది ఆమెను తిడుతూ కామెంట్లు చేశారు.