వైసీపీ నేత అరాచకం వైరల్

20 రూపాయల టోల్ కోసం టోల్ ప్లాజా వద్ద అల్లరి చేసి, గేటు తోసేసి సిబ్బందితో గొడవ పడి... ఒకర్ని కొట్టిన వైసీపీ మహిళా నేత అరాచకాన్ని నిన్నటి నుంచి దేశమంతా చూస్తోంది. ఏ సోషల్ మీడియాలో చూసినా అదే గొడవ. ఏపీ అధికార పార్టీ పరువును దేశ వ్యాప్తంగా గంగలో కలిసింది. రాష్ట్రంలో వైసీపీ నేతలు ఎలా వ్యవహరిస్తారో అందరికీ తెలిసిపోయింది. ఆమె వ్యవహార శైలి ఏపీ మహిళలకు కూడా తలవొంపులు తెచ్చింది.

ఆ వీడియో మీరు కూడా ఒకసారి చూడండి. జాతీయ స్థాయిలో ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ ఆమె అరాచకాన్ని దేశ ప్రజల ముందు పెట్టింది. ఆ వీడియో కింద ప్రతి ఒక్కరు వైసీపీ నేత రేవతి వ్యవహార శైలిని తీవ్రంగా తప్పుపడుతున్నారు. సుమారు 2400 మంది ఆమెను తిడుతూ కామెంట్లు చేశారు.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.