రెండు పరిణామాలు వైసీపీని ఆ పార్టీ అధినేత, సీఎం జగన్ను ఉక్కిరిబిక్కిరికి గురి చేస్తున్నాయి. ఒకటి.. అక్రమ ఆస్తులు.. క్విడ్ప్రోకో కేసులో తాజాగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇప్పటి వరకు జగన్కు సంబంధించిన 40 వేల కోట్ల కుంభకోణం(సీబీఐ పేర్కొన్నట్టు)లో క్విడ్ ప్రోకో జరగలేదని.. వైసీపీ నాయకు లు చెబుతున్నారు. ముఖ్యంగా ఈకేసుల్లో ఏ2గా ఉన్నవిజయసాయిరెడ్డి అయితే, ఎదురు దాడి మామూలుగా చేయలేదు.
కానీ, ఇప్పుడు ఈ కేసులకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న హెటిరో సంస్థ.. తనను ఈ కేసుల నుంచి విముక్తి కల్పించాలని కోరుతూ వేసిన పిటిషన్పై విచారించిన సుప్రీంకోర్టు.. సంచలన వ్యాఖ్యలు చేసింది. క్విడ్ ప్రోకో జరిగిందని .. సుస్పష్టం చేస్తూ.. వ్యాఖ్యానించింది. ఇది నైతికంగా కంటే.. కూడా రాజకీ యంగా జగన్కు, వైసీపీకి తీవ్ర విఘాతం కలిగించేలా ఉందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.
ఎందుకంటే.. ఈ హెటిరో కేసును తీవ్రంగా పరిగణించిన సుప్రీంకోర్టు దీనిపై సమగ్ర విచారణ జరుపుతా మని పేర్కొంది. పైగా సీబీఐ వేసిన చార్జిషీటు కూడా బలంగానే ఉందని పేర్కొంది. ఇదే జరిగితే.. అప్పుడు ఏం జరిగిందో నిముషాలు..గంటల లెక్కల్లో సుప్రీం వెల్లడించే అవకాశం ఉంది. ఇది వైసీపీకి రాజకీయంగా ఎదుర్కొనడం ఇబ్బందికర పరిణామమేనని అంటున్నారు పరిశీలకులు.
ఇక, మరో కీలక కేసు.. మాజీ సీజేఐ, జస్టిస్ ఎన్వీ రమణ వర్సెస్ సీఎం జగన్ కేసు. అప్పట్లో ప్రధాన న్యాయ మూర్తి రేసులో ఉన్న ఎన్వీరమణపై తీవ్ర విమర్శలు చేస్తూ.. సీఎం జగన్ అప్పటి ప్రధాన న్యాయమూర్తికి లేఖ సంధించారు. ఆ వెంటనే ఆ లేఖను ఆయన మీడియా కు విడుదల చేశారు. అయితే, ఈ లేఖను పరిశీలించేందుకు అప్పటి ప్రధాన న్యాయమూర్తి విముఖత ప్రదర్శించారు.
కానీ, ఇలా సీఎం ఒక న్యాయమూర్తిపై ఆరోపణలు చేయడాన్ని ఢిల్లీ బార్ అసోసియేషన్ తీవ్రంగా స్పందిస్తూ.. కేసు వేసింది. దీనిని ఇప్పుడు విచారణకు స్వీకరిస్తున్నట్టు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇది కూడా జగన్కు మురుసుతున్న మరో ఉపద్రవంగానే పరిశీలకులు చెబుతున్నారు.మ రి ఎన్నికల ముంగిట ఈ కేసులు విచారణకు వస్తే.. ఏం జరుగుతుందో ఎలా ఎదుర్కొంటా రో చూడాలి.