వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని భావిస్తున్న జనసేన.. ఆ దిశగా అందివచ్చిన అవకాశాన్ని సద్విని యోగం చేసుకుని ముందుకు వెళ్లేందుకు ప్రయత్నాలు సాగిస్తోంది. ముఖ్యంగా జగన్, వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకును చీలిపోకుండా చూడడంతోపాటు.. అధికారంలోకివచ్చేందుకు జనసేనాని పవన్ ఎంతో కృషి చేస్తున్నారు. దీనికి తన పార్టీ కేడర్ సహా..అభిమానులను కూడా ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. త్వరలోనే జిల్లాల పర్యటనలకు కూడా రెడీ అవుతున్నారు.
మరోవైపు… క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు రాజకీయంగా అడుగులు ముమ్మరం చేసేందుకు కూడా పపవన్ ప్రయత్నిస్తున్నారు. వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకును చీల్చకుండా ఉండేందుకు కీలకమైన టీడీపీతో పొత్తుకు కూడా పవన్ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే.. పవన్ చేస్తున్న ఇన్ని ప్రయత్నాలు ఒకవైపు సాగుతుంటే.. మరోవైపు.. ఈ ప్రయత్నాలకు గండికొట్టేలా.. జనసేన నాయకులే వ్యవహరిస్తున్నార నే విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి.
తిన్నింటి వాసాలు లెక్కపెట్టే విధంగా.. జనసేనలోనే ఉంటూ.. అధికార పార్టీకి లాభం చేకూర్చేలా కామెంట్లు చేస్తున్నారు కొందరు. ఈ క్రమంలో టీడీపీని ఏకేస్తున్న తీరు.. జనసేనలోనే విస్మయం కలిగిస్తోంది. జనసేనకు చెందిన శాంతి ప్రసాద్ శింగలూరి.. అనే మేధావి.. తన ఫేస్ బుక్ పోస్టుల్లో.. టీడీపీని ఏకేస్తున్నారు. చంద్రబాబును ఎందుకు ముఖ్యమంత్రిని చేయాలి? అంటూ.. ఆయన చేస్తున్న వ్యాఖ్యలు.. జనసేన కేడర్లో టీడీపీపై ఒకవిధమైన ఏహ్య భావాన్నిపెంచేలా చేస్తున్నాయి.
టీడీపీ వాళ్లపై జనసేన కేడర్ లో అసహ్యం పుట్టేలా శాంతి ప్రసాద్ కామెంట్లు పోస్టు చేస్తున్నారు. అంటే.. పవన్ రేపు టీడీపీతో పొత్తు పెట్టుకునేదుకు కేడర్ ముందుకు వచ్చే పరిస్థితి లేకుండా… ఒక విధమైన శూన్యతను ఆయన ప్రచారం చేస్తున్నారనే భావన కలుగుతోంది. ఇదే కనుక బలపడితే.. పవన్ పార్టీ.. టీడీపీతో పొత్తు పెట్టుకునే పరిస్థితి ఉండదు. ఉన్నా.. క్షేత్రస్థాయిలో టీడీపీపై వ్యతిరేకత పెరిగి.. జనసేన సైన్యం.. సహకరించే అవకాశం కూడా ఉండదు.
ఫలితంగా.. క్షేత్రస్థాయిలో వైసీపీ మరోసారి బలపడడంతోపాటు.. అధికారంలోకి వచ్చిన ఆశ్చర్యపోవాల్సి న అవసరం లేదని పరిశీలకులు అంటున్నారు. వాస్తవానికి పవన్ జగన్ పై పోరాడుతుంటే… జనసేన నాయకులు చంద్రబాబుపై పోరాడుతూ టీడీపీపై విషం కక్కుతున్నారు. వీరు వైసీపీ ట్రాప్ లో పడ్డారా? లేక వీరు వైసీపీ కోవర్టులా అని కొందరు నిజమైన జనసైనికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
గత ఎన్నికల్లోనే ఒంటరిగా పోటీ చేసి… పొరపాటు చేశామనే భావనతో ఉన్నవారు ఇలా ఆలోచిస్తున్నారు. అందుకే తప్పు దిద్దుకుని ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో అయినా.. టీడీపీతో కలిసి పనిచేయాలని అనుకుంటున్న తరుణంలో శాంతి ప్రసాద్ వంటి మేధావులు చేస్తున్న ఈ ప్రచారం .. అంతిమంగా.. జగన్కు.. వైసీపీకి లబ్ధి చేకూర్చేలా ఉందని అంటున్నా రు పరిశీలకులు. మరి ఇప్పటికైనా.. ఇలాంటి జగన్ కోవర్టులను పవన్ గుర్తించి.. మొదట్లోనే కట్టడి చేయా లని అంటున్నారు పరిశీలకులు.
శాంతి ప్రసాద్ ఒక్కరే కాదు…. వైసీపీ వాల్లు కూడా కొందరు జనసేన ముసుగులో టీడీపీ వారిని రెచ్చగొట్టి కయ్యానికి దిగుతున్నారు. వైసీపీ అధికారంలో ఉంటూ… పవన్ ను, మెగా కుటుంబాన్ని పూర్తిగా అణచివేస్తుంటే… గత ప్రభుత్వంలో మెగా కుటుంబానికి ఎంతో గౌరవం ఇచ్చిన చంద్రబాబుపై, తెలుగుదేశంపై వీరు విషం కక్కుతుండటమే పలు అనుమానాలకు తావిస్తోంది.