ఎన్టీఆర్ ను విశ్వ విఖ్యాత నట సార్వభౌమ అంటారు.
కానీ వైఎస్ఆర్ అంత కంటే గొప్ప ఖ్యాతిని, అంతర్జాతీయ గుర్తింపును సాధించారు
స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటీ పాఠాలకు ఎక్కిన వైఎస్ఆర్ చరిత్ర… జగన్ గర్వంతో కాలర్ ఎగరేయల్సిన సందర్భం… అప్పుడప్పుడు మనం ఎదో సెటైర్ గా అనుకుంటూ ఉంటాం.. “అరేయ్ నీ చరిత్ర అంతా ఎదో ఒక రోజు పాఠాలుగా చెప్పుకుంటారు” అని.. కాని మన దివంగత రాజశేఖర్ రెడ్డి గారు, ఆయన ఆత్మ కేవీపీ రామచంద్ర రావు గారు, ఇప్పుడు నిజంగానే పాఠాలకు ఎక్కారు.
ఏదో ఒక చిన్న స్కూల్ లో అనుకునేరు, ప్రపంచ ప్రఖ్యాత స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీలో వారి పేరు లిఖించబడింది. ఇది నిజంగా చాలా గొప్ప విషయం.
ప్రపంచంలోనే నెంబర్ వన్ అయిన యూనివర్సిటీలో రాజశేఖర్ రెడ్డి చరిత్ర అంటే మాటలా. ప్రతి వైఎస్ఆర్ అభిమాని, ముఖ్యంగా ఆయన పుత్ర రత్నం, కోడి కత్తి జగన్మోహన్ రెడ్డి గారు, గర్వంతో కాలర్ ఎగరేయల్సిన సందర్భం ఇది..
ఇంతకీ ఏ ఘనకార్యం చేసారని, ఇలా పాఠాలు చెప్తున్నారు అనుకుంటున్నారా ? వీళ్ళ అవినీతి చూసి, దిమ్మ తిరిగిన స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ, ఇది ఒక అవినీతి కేసు స్టడీగా, ఇంత పెద్ద అవినీతి ఎలా చేస్తారు అనే విషయం పై, వాళ్ళ పిల్లలకు పాఠాలు చెప్తుంది.
వీళ్ళ అవినీతి చరిత్ర రాష్ట్రం, దేశం దాటి ఇతర ఖండాలకు కూడా వ్యాపించింది. ప్రపంచ ప్రఖ్యాత స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీలో పాఠాలుగా చెప్పబడుతున్న రాజశేఖర్ రెడ్డి ,కేవీపీ రామచంద్రరావుల అవినీతి చరిత్ర ఈ కింద లింక్ లో ఉంది.
లింకు లేకపోతే దుష్ప్రచారం అన్నా అంటారు… అందుకే ఆధారాలు ఈ కింది లింకులో చూడొచ్చు.
వైఎస్సార్ విశ్వ విఖ్యాత అవినీతి చరిత్ర పాఠం ఇదే