నేను ఇక్కడే పుట్టాను. ఇక్కడే పెరిగాను. ఇక్కడే పిల్లలను కన్నా. ఇంకేం కావాలి. నా స్థానికత గురించి ప్రశ్నిస్తున్నారు. ఇదంతా టైం వేస్ట్. నా టార్గెట్ ఒక్కటే అదే తెలంగాణలో రాజన్న రాజ్యం తేవడమే.
ఈ రాజన్న రాజ్యం అనే బ్రహ్మపదార్థం ఏంటో ఎవరికీ అర్థం కాదు. రాజన్య రాజ్యం ఐదేళ్లుంటే … జగన్ లక్ష కోట్లు సంపాదించాడు. ఇక పదేళ్లు ఉంటే జగన్ ఆస్తి ఎంత ఉండేదో.
తెలంగాణలో పార్టీ పెట్టవద్దని అన్న అన్నారు.అమ్మ మాత్రం నా అభిప్రాయానికి ఓకే చెప్పింది. ఏపీలో వైయస్ ఆర్ కాంగ్రెస్ భారీ మెజారిటీ తో అధికారంలోకి వచ్చినప్పటికి అన్న జగన్ తనను ఎందుకు ప్రభుత్వంలో భాగస్వామిని చేయలేదో తనకు తెలియదన్నారు.
నీకే తెలియక పోతే సామాన్యులకు ఏం తెలుస్తుందక్కా షర్మిల?
(((())))))
ఒకే ఇంట్లో ఉంటారు, ఒకే ఇంట్లో రెండు పార్టీలు పెడతారు. ఇద్దరు వేర్వేరు రాష్ట్రాల కోసం ఒక రాష్ట్రంతో ఒకరు గొడవపడి రాష్ట్ర ప్రయోజనాలు సాధిస్తారట. పువ్వులు ఎవరి చెవిలో చూసిందో మరి షర్మిల.
కొందురు తెలంగాణలో పార్టీ పెట్టడం మాట్లాడుతున్నారని అసలు ఎక్కడ. నుంచి వచ్చారు. విజయశాంతిది ఎక్కడ అని ప్రశ్నించారు. ఎక్కడో పుట్టిన జయలలిత తమిళనాడు వచ్చి రాజకీయాలు చేసి ముఖ్యమంత్రి అయిన విషయాన్ని గుర్తుచేసారు.
అసలు జయలలితకి షర్మిలకు పోలిక ఏంటో.. ఆమె అక్కడే తారగా వెలుగొందారు.
తాను ఇక్కడే పిల్లలు కన్నాను. తన భర్తది ఇక్కడే కదా? అన్నారు. తనకు భర్త నుంచి సంపూర్ణ సహాయసహకారాలు ఉన్నాయన్నాయన్నారు. తెలంగాణ ప్రజల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పార్టీ పెడుతున్నట్లు చెప్పారు. పోలవరం నుంచి పోతిరెడ్డి పాడు దాక తెలంగాణ కు జరుగుతున్న అన్యాయంపై రాజీపడే ప్రశక్తే లేదన్నారు.
అన్నతో పోరాడి పోలవరం ఆపిస్తావా అక్కా… తెలంగాణ ప్రజలు నిన్ను నమ్మాలి. పోలవరం కడతాను అంటే ఏపీ ప్రజలు జగన్ ను నమ్మాలి. కానీ రెండు నిర్ణయాలు ఒకే ఇంట్లో జరుగుతాయి. దానిపేరు తెలుగులో కమలంకుంట ఇంగ్లిష్ లో లోటస్ పాండ్.
అంతేనా అక్కా ఇంకేమైనా చెప్పేదుందా?