2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ వివేకా హత్య కేసే హాట్ టాపిక్. అది ఎన్నికల అంశంగానూ మారింది. తన బాబాయిని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడిని హత్య చేయించారంటూ ఆరోపించిన అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. రాజకీయంగా ఆ కేసును తనకు అనుకూలంగా బాగానే ఉపయోగించుకున్నారు.
కట్ చేస్తే ఇప్పుడు 2024 అసెంబ్లీ ఎన్నికల ముంగిట కూడా వివేకా హత్య కేసు ఎన్నికల అంశంగా మారింది. కాకపోతే ఇప్పుడు ఆ కేసు జగన్, ఆయన సోదరుడు అవినాష్ రెడ్డిల మెడకే చుట్టుకునే పరిస్థితి నెలకొంది. అవినాషే తన తండ్రిని హత్య చేయించాడని, జగన్ అతడికి వెన్నుదన్నుగా నిలిచారని సునీత తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ఈ విషయాన్ని జనాల్లోకి తీసుకెళ్లడంలో సునీతతో పాటు షర్మిళ బాగానే విజయవంతం అవుతున్నారు.
కడప ఎంపీ అభ్యర్థిగా నిలిచిన షర్మిళ, ఆమెకు మద్దతుగా ప్రచారంలో పాల్గొంటున్న సునీత.. ప్రతి చోటా వివేకా హత్య కేసునే ప్రస్తావిస్తూ ప్రచారం సాగిస్తున్నారు. తాజాగా సునీత హైదరాబాద్‌లో మీడియాకు వివేకా హత్య కేసు మీద పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడం గమనార్హం. హత్యలో పాలుపంచుకున్న దస్తగిరికి.. మిగతా నిందితులకు మధ్య జరిగిన ఫోన్ కాల్స్, వాట్సాప్ సంభాషణలను ఆమె వివరంగా ఇందులో చూపించారు.
అవినాష్‌తో వీళ్లకు మధ్య జరిగిన కాల్స్ గురించి కూడా ఆమె వివరంగా చెప్పారు. తన తండ్రి హత్యకు ఎలా కుట్ర జరిగింది.. హత్య సమయంలో ఏం జరిగింది సీబీఐ ఛార్జ్‌షీట్ ఆధారంగా ఆమె మీడియాకు వివరించారు. అంతే కాక మీడియా ప్రశ్నలకూ సమాధానం చెప్పారు. ఈ కేసు విషయంలో ప్రధానంగా సాక్షి మీడియానే టార్గెట్ చేయడం మీద దాని ప్రతినిధి ప్రశ్నిస్తే.. హత్య జరిగిన ప్రదేశం నుంచి సాక్షికే ఉదయం పూట ఫస్ట్ కాల్ వెళ్లిందని.. వాళ్లే తన తండ్రిది హత్య కాదు గుండెపోటు అని ప్రచారం చేశారని ఆమె చెప్పారు. ఇంకా సాక్షి మీడియా ప్రతినిధి అడిగిన వేర ప్రశ్నలకూ ఆమె దీటుగా బదులిచ్చారు.
ఏమి నటులురా మీరు? #KodiKathiDrama2 #AbbaiKilledBabai #JusticeForBabai #YCPAntham #ByeByeJaganIn2024 #AndhraPradesh pic.twitter.com/3zTh6DAxqb
— Telugu Desam Party (@JaiTDP) April 15, 2024