కొట్టుకు చచ్చేంత కోపం.. కొట్టుకు చచ్చినా తీరని కోపం మనుషులలో అప్పుడప్పుడూ పుడుతుంది. కానీ ఇప్పుడు అనైతికత అన్నది ఓ పెద్ద ఐకానిక్ వెర్షన్ కనుక ఎవ్వరూ దానిని ప్రశ్నించకూడదు. ఆ మాటకు వస్తే సెమీ పోర్న్ వీడియోలు చేస్తూ నీవు ఏం సందేశం ఈ సమాజానికి ఇస్తున్నావు అని ఓ సోషల్ యాక్టివిస్ట్ యూ ట్యూబర్ శ్రీకాంత్ రెడ్డిని అడిగితే నోటికి వచ్చిందంతా మాట్లాడుతున్నాడే కానీ.. వివరం మాత్రం స్పష్టంగా ఇవ్వడం లేదు. సెమీ పోర్న్ వీడియోలు చేస్తున్నప్పుడు నీకెందుకింత బలుపు అని కూడా ఆమె అన్నారు.. అలా అన్నప్పుడు కూడా తన తప్పు ఇది అని మాత్రం చెప్పలేకపోతున్నాడు.. మాట్లాడలేకపోతున్నాడు..
ఎవ్వరు లైవ్ లోకి వచ్చినా కూడా తనదైన పొగరు లేదా కండకావరంతోనే మాట్లాడుతున్నాడు. ఏమంటే యూ ట్యూబ్ అల్గారిథమ్ ఒకటి అప్పజెబుతున్నాడు. లేదా వల్లె వేస్తున్నాడు. ఆగడాగండి శ్రీకాంత్ రెడ్డే కాదు చాలా సంస్థలు ఇదే కోవలో ఉన్నాయి. మల్లె మాల సంస్థల అధినేత్రి దీప్తి మల్లెమాల బ్రాడ్ కాస్ట్ చేయిస్తున్న జబర్దస్త్ లో కూడా అడల్ట్ కంటెంటే ఉంది. ఉంటుంది కూడా ! కానీ అడిగిన వాళ్లకు వాళ్లు ఇచ్చే సమాధానాలు చాలా తిక్క తిక్కగా ఉంటాయి.
చాలా రోజుల కిందట అలీ ఓ షోలో చాలా బూతులు మాట్లాడితే మహిళా సంఘాలు తీవ్రంగా స్పందించేయి. దెబ్బకు గురుడు దిగివచ్చి తరువాత షో లో వాటిని పూర్తిగా తగ్గించాడు. అంటే ఎవ్వరో ఒక్కరు మాట్లాడితే కానీ తెలివి తెచ్చుకోలేని స్థితిలో మీడియా ఉన్నప్పుడు వాటికో విలువ, వాటికో హుందాతనం ఆశించడమే తప్పు అవుతుంది.
ఇక మల్లెమాల గతంలో కూడా అనేక వివాదాలనే చూసింది. పటాస్ షో లో నర్సింగ్ వృత్తిని కించపరుస్తూ స్టాండప్ కామెడీ చేయించిన వైనంపై కూడా అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. ఆఖరికి యాంకర్ రవి క్షమాపణలు చెప్పే వరకూ వదల్లేదు. కానీ ఇప్పుడు సీన్ మరో విధంగా ఉంది. ఓ షోలో బూతులు మాట్లాడడం, అడల్ట్ కంటెంట్ చొప్పించడం వంటివి శ్రీకాంత్ రెడ్డి ఒక్కడే కాదు శ్యాం ప్రసాద్
రెడ్డి (మల్లెమాల సంస్థల అధినేత) కూడా చేస్తున్నారు. కానీ ఆ సంస్థను ఎన్ని సార్లు క్వశ్చన్ చేస్తున్నా ఆన్సర్లే భిన్నంగా ఉంటున్నాయి.