దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నా.. లాక్ డౌన్ లాంటివి ప్రకటించలేదు. కానీ.. కొన్ని దేశాల్లో లాక్ డౌన్ నడుస్తోంది. ఇలాంటివేళ.. అనూహ్య ప రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి బయటకు వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది. మూసి ఉన్న సినిమా హాల్లో దొంగతనంగా దూరిన ఆ జంట చేసిన పనులు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఇంతకూ జరిగిందేమంటే..
రష్యాలోని సెయింట్ పీటర్స్ బర్గ్ కు చెందిన ఒక జంట లాక్ డౌన్ వేళ నిబంధనలకు విరుద్ధంగా బయట తిరిగారు. అంతేకాదు.. సౌత్ పోల్ షాపింగ్ మాల్ లోకి వెళ్లి.. అక్కడున్న కినోగ్రాడ్ సినిమా హాల్లోకి చొరబడ్డారు. లోపల ఎవరూ లేకపోవటంతో వారు మరింత హుషారుగా మారారు. అక్కడే ఉన్న పాప్ కార్న్.. కూల్ డ్రింక్స్ ఇలా చేతికి వచ్చిన పుడ్ ను ఫుల్ గా లాగించేశారు. అనంతరం హాల్లోకి వెళ్లారు.
అక్కడ ఎవరూ లేకపోవటంతో.. అసలు పనిలోకి దిగారు. అక్కడే రొమాన్సు చేసి ఎంజాయ్ చేశారు.అయితే.. వారు గుర్తించని విషయం ఏమంటే.. థియేటర్లో సీసీ కెమేరాలు ఉంటాయని.. వారి ప్రతి కదలికను అవి రికార్డు చేస్తాయన్న విషయాన్ని మర్చిపోయారు.రాత్రంతా ఫుల్ గా ఎంజాయ్ చేసి.. ఉదయాన్నే లేచి తమ దారిన తాము వెళ్లిపోయారు. సినిమా హాల్ సిబ్బంది.. సీసీ కెమెరాలో ఫీడ్ అయిన దాన్ని ఈ జంట పనులకు షాక్ తిన్నారు.
అయితే.. సినిమా థియేటర్ యాజమాన్యం మాత్రం వారికి ఉచిత టికెట్లను ప్రకటించి అందరిని సర్ ప్రైజ్ చేశారు. ఈ జంట చేసిన పనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ.. థియేటర్ యాజమాన్యం మాత్రం తన స్టాండ్ ను క్లియర్ గా చెప్పేసింది. వారు చేసిన పని ఎలా ఉన్నా.. తమ థియేటర్ లో చెత్తగా ఉన్న చోటును నీట్ గా శుభ్రం చేశారని.. అందుకే వారికి ఉచితంగా టికెట్లు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ జంటకు సంబంధించిన సీసీ ఫుటేజ్ చిన్న క్లిప్ గా మారి సోషల్ మీడియాలో హడావుడి చేస్తోంది. దీన్ని చూసినోళ్లలో కొందరు తిట్టిపోస్తుంటే.. మరికొందరు వారు చేసిందేమీ తప్పు కాదన్న వాదనను వినిపిస్తున్నారు. మరి.. మీ మాటేమిటి?