నిన్న అసెంబ్లీ…నేడు పార్లమెంట్…వేదిక ఏదైనా వైసీపీ నేతల తీరు ఒకటే…మాట్లాడే బూతుల భాష ఒకటే. అసెంబ్లీలో రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేదని నారా భువనేశ్వరి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడిన వైసీపీ నేతలను జనం ఛీకొట్టారు. అయినప్పటికీ, తీరు మారని వైసీపీ నేతలు మరోసారి తమకు మాత్రం సాధ్యమైన కుసంస్కారమైన భాషతో పవిత్రమైన పార్లమెంటులో తెలుగు వారి పరువు తీశారు.
ఈ రోజు లోక్ సభ శీతాకాల సమావేశాల సందర్భంగా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ, ఎంపీ మిథున్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం నడిచిన సంగతి తెలిసిందే. అయితే, రఘురామ మాట్లాడుతునన సందర్భంలో కొందరు వైసీపీ ఎంపీలు అసభ్య పదజాలంతో దూషించారని ఆరోపణలు వచ్చాయి. స్వయంగా ఈ విషయాన్ని మీడియాకు రఘురామ వెల్లడించారు. లం—కొడకా….నువ్వు మాట్లాడకురా…అంటూ పార్లమెంటు నిండు సభలో నలుగురైదుగురు వైసీపీ ఎంపీలు తనను దూషించారని రఘురామ సంచలన వ్యాఖ్యలు చేశారు.
బోసిడీకే కూడా అనలేదు…లం—కొడకా….అని తిడతారా? రాస్కెల్స్…. అనాలనుందని, కానీ, ఆ మాట ప్రజలంటారని రఘురామ ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్ సభ రికార్డుల్లో అంతా రికార్డయిందని, ఇదేనా వైసీపీ సభ్యుల సంస్కారం అని రఘురామ ఫైర్ అయ్యారు. వైసీపీ ఎంపీలకు తెలుగు రాదని, ఇంగ్లిష్ రాదని, వారికి బూతుల భాష తప్ప మరొకటి రాదని షాకింగ్ కామెంట్లు చేశారు. గతంలో పట్టాభి విషయంలో నానా యాగీ చేసిన వైసీపీ నేతలు…మరి రఘురామపై తమ పార్టీ ఎంపీలు చేసిన వ్యాఖ్యలపై కూడా అదే స్థాయిలో మండిపడతారా? వారి ఇళ్లపై, తమ పార్టీ ఆఫీసులపై కూడా దాడులు చేస్తారా అన్న చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది.