ఇటీవల వైసీపీ నుంచి బయటకు వచ్చి జనసేనకు జైకొట్టిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. నన్ను రెచ్చగొట్టారు.. మానసికంగా వేధించారు.. రిటర్న్ గిఫ్ట్ ఇస్తా కాసుకోండి.. అని ఆయన వా ర్నింగ్ ఇచ్చారు. అంతేకాదు.. తనను తక్కువ అంచనా వేసేవారికి త్వరలోనే సమాధానం చెబుతానన్నా రు. అదేసమయంలో విశాఖ వైసీపీని క్లీన్ చేసేస్తానని ఆయన శపథం చేశారు.
తాజాగా విశాఖలో మీడియాతో మాట్లాడిన వంశీ.. వైసీపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. వైసీపీలో ఉన్నంతకాలం పార్టీ నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని తెలిపారు. ‘‘ఈ రాష్ట్రంలో బహుశా నేను ఒక్క రూపాయి తీసుకోకుండా పార్టీ కార్యాలయాన్ని నడిపించాను. నా మీద కామెంట్స్ చేసే వెధవలు ఈ విషయాలు తెలుసుకొని మాట్లాడాలి. రాజకీయాల్లోకి వచ్చి 60 ఎకరాలు అమ్ముకున్నాను. పార్టీ కోసం నయవంచన లేకుండా పనిచేశాను“ అని వంశీ అన్నారు.
తనను ఉద్దేశ పూర్వకంగా వైసీపీ నాయకులు రెచ్చగొట్టారని, సోషల్ మీడియాలో తీవ్ర పదాలతో విమర్శలు చేశారని, వారికి త్వరలోనే రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చెప్పారు. వైసీపీ బీసీలను బాగా చూస్తే. మేమంతా ఎందుకు బయటకు వచ్చామని ప్రశ్నించారు. మంత్రి గుడివాడ అమర్నాథ్ పార్టీ మారినప్పుడు ఆత్మహత్య కాదా.. నేను పార్టీ మారితే ఆత్మహత్య అవుతుందా అని ప్రశ్నించారు.
“నేను పార్టీ కోసం జీవితం దార పోశాను. అమర్నాథ్ నాకన్నా వెనక వచ్చి జాకపాట్ కొట్టారు. జగన్ ని బూతులు తిట్టిన వారే ఇప్పుడు మంత్రులుగా ఉన్నారు. ఏయూ మాజీ వీసీ కార్పొరేటర్ల టికెట్లు డిసైడ్ చేశారు. ఉత్తరాంధ్రలో పార్టీ పదవులు వేసింది వీసీ ప్రసాద్ రెడ్డి. మంత్రుల దగ్గర నుంచి అందరూ వెళ్లి ప్రసాద్ రెడ్డి కాళ్ళు పట్టుకుంటున్నారు. జగన్ చుట్టూ దద్దమ్మలు చేరిపోయారు. నా పొలిటికల్ కెరియర్ ఇలా అవడానికి ఎంవీవీ సత్యనారాయణ కీలకపాత్ర పోషించారు“ అని వంశీ ఆవేదన వెళ్లగక్కారు.
ఎంపీ ఎంవీవీ అంతు చూస్తానని వంశీ వ్యాఖ్యానించారు. రాజకీయ క్షోభ ఎలా ఉంటుందో రుచి చూపిస్తానన్నారు. పార్టీ మారేందుకు 10 మంది ఎమ్మెల్సీలు, 30 మంది కార్పొరేటర్లు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. తంలో వైసీపీ అభివృద్ధికి ఎలా పనిచేశానో ఇప్పుడు జనసేన అభివృద్ధికి అలాగే పని చేస్తానని వంశీ వ్యాఖ్యానించారు.