నెల్లూరు జిల్లాలో వైసీపీ నాయకులు కట్టగట్టుకుని.. కుస్తి పడుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇక్కడ నేతల మధ్య ఒకప్పుడు సన్నిహితమైన రాజకీయాలు నడిచాయి. ఎందుకంటే.. ప్రస్తుతాన్ని చెప్పుకోనేటప్పుడు.. ఖచ్చితంగా గతాన్ని కూడా గుర్తు చేసుకోవలి. గతంలో అనిల్‌కుమార్, కోటంరెడ్డి, కాకాని గోవర్ధన్‌రెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్.. ఇలా చాలా మంది నాయకులు.. వైసీపీ కోసం పనిచేశారు.
జగన్ పాదయాత్ర సమయంలో వీరంతా కూడా. పార్టీ కోసం.. పాదయాత్ర చేసిన సందర్భాలు ఉన్నాయి. అనిల్, కోటంరెడ్డిలు.. పెద్ద ఎత్తున జగన్ సీఎం కావాలంటూ.. నిత్యం మీడియా ముందుకు వచ్చి. హల్చల్ చేశారు. జగన్‌ను సీఎంగా చూడాలని కూడా కలలు కన్నారు. అయితే.. జగన్ సీఎం అయ్యారు. కానీ, గతంలో ఉన్న సఖ్యత.. స్నేహం.. పలకరింపు వంటివి ఇప్పుడు లేకుండా పోయాయి.
వ్యక్తిగత ఆవేదనలు.. వ్యక్తిగత కౌంటర్లు.. వ్యక్తిగత ప్రభావం దెబ్బతింటున్న వైనాలపై నాయకులు కలత చెందుతున్నారు. ఈ క్రమంలోనే వారు ఎవరితోనూ కలవడం లేదు. అంతేకాదు..ప్రతి విషయాన్ని రాజకీ యం కూడా చేస్తున్నారు. తమకు పదవులు ఇవ్వకుండా.. అడ్డుపడింది.. తమవారేననే బెంగ, ఆవేదన రెండు కూడా వారిలో ఉన్నాయి. ఈ క్రమంలో అధిష్టాన్ని చెరిగేయాలని ఉంది.
కానీ, అలా చేయలేరు. ఏరికోరి ఎంచుకున్న గెలిపించుకున్న ప్రభుత్వం.. నాయకుడు. సో.. ఇప్పుడు అలా చేయలేక.. అలాగని క్షేత్రస్థాయిలో పరిస్థితిని అదుపు చేయలేక.. రోడ్డున పడుతున్నారనే భావన వ్యక్తం అవుతోంది. మంత్రి పదవి నుంచి దిగిపోయిన తర్వాత.. అనిల్‌కుమార్ ఎక్కడున్నారో ఎవరికీ కనిపించ లేదు. మంత్రిగా ఉన్నప్పుడు.. మాత్రం హల్చల్ చేశారు. మొత్తంగా.. నెల్లూరు వైసీపీ రాజకీయం మాత్రం చాలా భిన్నంగా ఉండడం గమనార్హం.