సోెషల్ మీడియాలో రెండు వైపులా పదునున్న కత్తి. ఎదుటోడిని చీల్చిచెండాటమే కాదు, ఒక్కోసారి వెనక్కు తగిలి కోసేస్తుంది. ఒకసారి ఆ పార్టీకి కన్నీళ్లు ఇంకోసారి ఈ పార్టీకి కన్నీళ్లు తెప్పిస్తుంది. తాజాగా ఏపీలో సెంటు భూమి (48 గజాల స్థలం) ఇచ్చి ఇంటి పట్టాలు అంటూ వైసీపీ సర్కారు భారీ ప్రచారానికి తెరలేపింది.
గతంలో చంద్రబాబు ప్రభుత్వం కట్టించిన ఇళ్లు 2 సెంట్లలో నాణ్యతగా కట్టడమే కాదు, అందులో ఆరుగురున్న కుటుంబం హాయిగా నివసించేలా ఉండేది. అయితే, ఇపుడు ఇంటి పట్టా అని ‘‘భూమి’’ ఎమోషన్ కలిపి ఓటువేయించుకోవడానికి తప్ప మరెందుకు పనికిరాని పట్టాలు ఇస్తోంది ప్రభుత్వం. అయితే పేదోడికి ఎంతో కొంత వచ్చిందిలే అన్న సంతోషం ఉంటుంది. ఆ ఎమోషన్ ను క్యాచ్ చేద్దామని వైసీపీ చేసిన ప్రయత్నాలు కూడా పూర్తిగా సఫలం కాలేదు.
ఎందుకంటే గతంలో చంద్రబాబు ప్రభుత్వం కట్టించి ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ఇళ్లను కూడా కొన్ని చోట్ల పంచుతున్నారని ప్రచారం జరిగింది. దీంతో జగన్ ఫొటో ఉన్న బ్రోచర్ చేతిలో పెట్టి ఒక వృద్ధురాలికి ఇంటి పట్టా ఇచ్చి నీకు ఇల్లు ఎవరిచ్చారమ్మా అని వైసీపీ నేతలు అడిగారు. దానికి ఆమె తుడుముకోకుండా… శెంద్రబాబు అని చెప్పేసింది. దీంతో ఖంగుతినడం వైసీపీ నేతల వంతయ్యింది. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
మరోచోట కూడా వైసీపీ నాయకులకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఆ వీడియో కూడా కింద చూడొచ్చు.