ఏపీలో జగన్ చేస్తున్న అప్పులు నానాటికీ పెరిగిపోతున్నాయని, ఏపీ మరో శ్రీలంక కావడానికి ఎక్కువ సమయం పట్టదని టీడీపీ అధినేత చంద్రబాబు మొదలు…తాజాగా ఆర్థిక నిపుణులు సైతం వార్నింగ్ ఇస్తున్నారు. అయితే, జగన్ మాత్రం..నేనేమీ చంద్రబాబు కంటే ఎక్కువ అప్పలు చేయలేదని బుకాయిస్తూ తప్పుడు లెక్కలు చూపిస్తున్నాయి. ఇంకా గట్టిగా మాట్లాడితే ఆ అప్పు చేసింది కూడా జనం కోసమే కదా అంటూ జగన్ ఓ పనికిమాలిన లాజిక్ తెస్తున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా జగన్ అప్పుల చిట్టాలోని లొసుగులను సోషల్ మీడియాలో టీడీపీ కార్యకర్తులు బట్టబయలు చేశారు. ప్రజల కోసమే అప్పులు చేసి పంచారమని చెబుతున్నది పచ్చి అబద్ధమని గణాంకాలతో సహా గుట్టురట్టు చేశారు. పింఛన్లు, నవ రత్నాలు, ఈ తరహా పథకాలు గతంలో లేవని, అన్నీ జగన్ ప్రవేశపెట్టారని వైసీపీ నేతలు చెప్పుకున్న విషయాన్ని వారు గుర్తు చేశారు.
అయితే, 2022 మార్చి 15న బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో చేసిన ఓ ప్రకటనను ఉటంకిస్తూ వైసీపీ లెక్కలు తేల్చారు. వైసీపీ ఇప్పటి దాకా లక్షా ముఫ్పై వేల కోట్ల రూపాయలను సంక్షేమ పథకాల కోసం పంచినట్లు బుగ్గన స్వయంగా వెల్లడించారని, అదిగాక లక్షా ఇరవై వేల కోట్లు అప్పు చేశారని వెల్లడించారు. అది మొత్తం కలిపితే రెండున్నర లక్షల కోట్లు.
కానీ, జగన్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా దాదాపు ఐదు లక్షల పదిహేను వేల కోట్లు అప్పు చేశారని షాకింగ్ నిజం వెల్లడించారు. ఆ లెక్కన చూస్తే జగన్ చేసిన అప్పుల్లో మిగతా మూడు లక్షల కోట్లు ఏమయ్యాయని వారు జగన్ ను నిలదీస్తున్నారు. మరి, ఆ 3 లక్షల కోట్లు ముచ్చటగా ఎక్కడ ఖర్చు పెట్టారో జగన్ చెబుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
Comments 1