కేసీఆర్ కి … బండి సంజయ్ ఎలా తగులుకున్నాడంటే… ఎలా వదిలించుకోవాలో తెలియక… ఏం చేయాలో తెలియక… రేపు ఏం మాట్లాడతాడో అన్న భయంతో బతికేలా చేస్తున్నాడు. బండి సంజయ్ మాట్లాడే ఒక్కోమాట… తూటాల్లా పేలుతున్నాయి. తాజాగా మంత్రి కేటీఆర్‌ను సీఎంను చేసే ప్రయత్నంలో కేసీఆర్ బిజీగా ఉన్నారు.
కేటీఆర్ సీఎం అయితే తమ మంత్రి పదవి పోకుండా ఉండేందుకు ఆల్రెడీ తెలంగాణ మంత్రులు పొగడ్తలు స్టార్ట్ చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కేటీ రామారావు సీఎం అయితే… టీఆర్ఎస్ లో అణుబాంబు కంటే భారీ పేలుడు జరగడం ఖాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి పనిచేసిన వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను ఎందుకు సీఎం చేయకూడదని ప్రశ్నించారు.
ఈటల ఏం తక్కువ చేశారు? కేటీఆర్ ఏం ఎక్కువ చేశారు? సీఎం కుమారుడే సీఎం కావాలా? దళితుడిని సీఎం చేస్తే ఏమవుతుంది? అసలు తెలంగాణ ఉద్యమంలో కేటీఆర్ పాత్ర ఏంటి? అని సంజయ్ ప్రశ్నించారు. బండి సంజయ్ తాజా వ్యాఖ్యలతో తెలంగాణ ప్రజలకు కుటుంబం పదవులను పంచుకుంటుంది… తెలంగాణను సొంతానికి వాడుకుంటుంది అన్న భావనను ప్రజల్లో క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు బండి సంజయ్.
ఇప్పటికే కేసీఆర్ ఇంట్లో లెక్కలేనన్ని పదవులున్నాయి.
కేసీఆర్ – సీఎం
కేటీఆర్ – మంత్రి
హరీష్ రావు – మంత్రి
కవిత – ఎమ్మెల్సీ
సంతోష్ – రాజ్యసభ ఎంపీ,
కేటీఆర్ భార్య సోదరుడు – ప్రత్యేక కాంట్రాక్టులు
ఇలా ప్రజల కోసం ప్రజల ఉద్యమంతో పుట్టిన తెలంగాణలో పదవులన్నీ తన ఇంటికే పంచుకుంటున్నారు కేసీఆర్ అని ఇప్పటికే ప్రజల్లో ఆగ్రహం ఉంది. పోనీ మంత్రి పదవులు మిగతావి అయినా వేరే వాళ్లకి ఇచ్చారు లే అనుకుందాం అంటే…. వాళ్లకి పదవులైతే ఇచ్చారు గాని పవరంతా కుటుంబం చేతిలోనే ఉంది. ఏ మంత్రిత్వ శాఖలో పని అవ్వాలన్నా, ఏ మంత్రి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కేటీఆర్ అనుమతి కావాల్సిందే. అందుకే ప్రజలు ప్రత్యామ్నాయం కోసం బీజేపీ వైపు చూస్తున్నారు.