నెల్లూరు జిల్లా కందుకూరు చంద్రబాబాబు సభలో జరిగిన తొక్కిసలాట ఘటనపై కేసు నమోదయింది.
సెక్షన్ 174 కింద కందుకూరు పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేశారు.
ఈ ఘటనలో 8 మంది మరణించగా, పలువురికి గాయాలయ్యాయి. పోలీసులు విచారణ అనంతరం నిందితుల పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చనున్నారు.
కాగా, పోలీసులు ఈ కేసును సుమోటోగా తీసుకుని నమోదు చేసినట్టు తెలిసింది.
ఏమిటీ 174 సెక్షన్?
కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్(సీఆర్ పీసీ)లోని 174 సెక్షన్ కింద.. కందుకూరు ఘటనపై పోలీసుల కేసు పెట్టారు.
దీంతో ఈ సెక్షన్ ఏంటి? ఏయే అభియోగాలు నమోదు చేయొచ్చు.. అనేది ఆసక్తిగా మారింది.
* పోలీసు స్టేషన్ అధికారి లేదా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అధికారం పొందిన ఇతర పోలీసు అధికారి ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని లేదా మరొక వ్యక్తి లేదా జంతువు లేదా యంత్రం కారణంగా లేదా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడని సమాచారం అందుకున్నప్పుడు ఈ 174 సెక్షన్ కింద కేసు పెడతారు.
* ఎవరైనా ఇతర వ్యక్తి నేరం చేశారనే సహేతుకమైన అనుమానాన్ని లేవనెత్తే పరిస్థితులలో, వెంటనే విచారణ చేపట్టడానికి ఈ సెక్షన్ అనుమతి ఇస్తుంది.
* తాజా కేసులో టీడీపీ నేతలు నేరం చేశారనే నిర్ధారణకు వచ్చేందుకు ఈ సెక్షన్ ఉపయోగపడుతుంది.
* రాష్ట్ర ప్రభుత్వం సూచించిన జిల్లా లేదా సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ ప్రత్యేక ఉత్తర్వుతో ఘటనా ప్రాంతానికి వెళ్లి ఆధారాలు సేకరించే అధికారం కల్పిస్తుంది.
* ఈ సెక్షన్ ప్రకారం.. ఆత్మహత్య, ఉద్దేశ పూర్వక ప్రమాదం సృష్టించి చంపేయడం, ఉద్దేశ పూర్వకంగా చంపేసుకునేలా ప్రోత్సహించడం వంటివాటిలో ఏదైనా వర్తింప చేసే(ఘటనను బట్టి) అధికారం.. పోలీసులకు వస్తుంది.
* అదేసమయంలో ఈ సెక్షన్ 174 ప్రభుత్వ జోక్యానికి కూడా అనుమతిస్తుంది. అంటే.. పోలీసులు నిర్ణయంతీసుకోలేని పక్షంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు కేసు పెట్టొచ్చు.
* సెక్షన్ 174 క్రిమినల్ కేసు పెట్టేందుకు అధికారం కల్పిస్తుంది.