• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

రమ్యకృష్ణ కొత్త కాంట్రవర్సీ

రమ్యకృష్ణపై ఆ నటి అభాండాలు.. అసలేం జరిగింది?

admin by admin
July 5, 2021
in Movies
0
0
SHARES
2.8k
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే నటిగా పేరుంది వనితా విజయ్ కుమార్. సీనియర్ నటులు విజయ్ – మంజుల కుమార్తెగా సుపరిచితురాలైన ఆమె.. వ్యక్తిగత అంశాల్లో చాలానే వివాదాలు ఉన్నాయి. తరచూ వార్తల్లో నిలిచే ఆమె.. తాజాగా సీనియర్ నటి.. వివాదాలకు దూరంగా ఉంటారన్న పేరున్న రమ్యకృష్ణ మీద ఘాటుగా పరోక్ష విమర్శలు చేయటం షాకింగ్ గా మారింది.

తాజాగా ఆమె నటిస్తున్న బిగ్ బాస్ జోడిగల్ రియాలిటీ షో నుంచి తప్పుకున్నట్లుగా ప్రకటించిన వైనం సంచలనమైంది. అంతేకాదు.. సీనియర్ నటి కారణంగా తాను షో నుంచి బయటకు వచ్చేసినట్లుగా సోషల్ మీడియాలో పేర్కొనటం కొత్త చర్చగా మారింది. ఇంతకీ వనితా విజయ్ కుమార్ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? రమ్యకృష్ణ మీద ఆమె చేసిన ఆరోపణలు ఏమిటి? దీనికి సదరు సీనియర్ నటి ఏమని స్పందించింది అన్న విషయాల్లోకి వెళితే..

వరుస పెళ్లిళ్లకు సంబంధించిన విషయాల్లో వనితా విజయ్ కుమార్ పై చాలానే విమర్శలు ఉన్నాయి. వ్యక్తిగత అంశాలతో ఆమె నటనకు కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. అలాంటి ఆమె తాజాగా స్టార్ విజయ్ టీవీలో ప్రసారమవుతున్న బిగ్ బాస్ రియాలిటీ షో (బిగ్ బాస్ జోడిగల్) లో పాల్గొంటూ మరోసారి తెర మీదకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె షో నుంచి తప్పుకున్నట్లుగా ట్విటర్ లో ఒక లేఖ పోస్టు చేశారు.

అందులో కాస్టింగ్ కోచ్.. వేధింపులు.. అవమానాలు అంటూ పలు ఆరోపణలు చేసిన ఆమె.. ఒక సీనియర్ నటి కారణంగా షో నుంచి బయటకు రావాల్సి వచ్చిందని పేర్కొన్నారు. “సాధారణంగా మహిళల్లో ఎక్కువగా అసూయ ఉంటుంది. అయితే పనిచేసే చోట ఎక్కువగా మగవారి వేధింపులు ఎదురువుతుంటాయని తెలుసు. మీటూ, క్యాస్టింగ్ కౌచ్ అని ప్రతి రంగంలో ఉంటాయి. ముఖ్యంగా అధికారం కోసం మహిళలు ఏమైనా చేస్తుంటారు. ఒక స్త్రీ.. మరో స్త్రీకి సాయం చేయాలి. కొత్త వారికి సపోర్ట్ ఇవ్వాలి. కానీ వారితోనే పోటి పడేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలోనే వారి జీవిత ప్రయాణం ఎక్కడికి చేరుకోవాలనే విషయం మరచిపోతుంటారు ” అంటూ ఆమె లేఖలో పేర్కొన్నారు.

తనకు అవకాశం ఇచ్చిన విజయ్ టీవీకి ధన్యవాదాలు తెలిపిన ఆమె.. కుటుంబం.. భర్త లాంటి ఎలాంటి సపోర్టు లేకుండా ఒంటరిగా జీవనయానాన్ని సాగిస్తున్న ముగ్గురు పిల్లల ఒంటరి తల్లిని వేధింపులకు గురి చేసినట్లుగా పేర్కొన్నారు. తాను ఒక సీనియర్ నటి కారణంగానే షో నుంచి తప్పుకున్నట్లుగా పేర్కొన్నారు. అయితే.. ఆ షోలో ఉన్న సీనియర్ నటి ఒక్క రమ్యకృష్ణ మాత్రమే. దీంతో.. వనితా విజయకుమార్ చేసిన ఆరోపణలన్ని ఆమె పైనే అన్న అభిప్రాయం బలపడింది.

వనితా పోస్టు చేసిన లేఖ వివాదంగా మారింది. ఇదే అంశంపై రమ్యకృష్ణను ప్రశ్నించినప్పుడు ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. షోలో ఏం జరిగిందో కూడా మీరు ఆమెని అడిగి ఉంటే బాగుండేది.. నా వరకు నాకు ఇదేం పెద్ద విషయం కాదంటూనే నో కామెంట్స్ అని వ్యాఖ్యానించటం గమనార్హం. వనిత మాదిరి ఘాటుగా రియాక్టు కాకుండా కూల్ గా మాట్లాడిన రమ్యకృష్ణ.. ఇష్యూను మరింత పొడిగించకుండా తుంచేసినట్లుగా చెబుతున్నారు. షోలో వనితా విజయకుమార్ కు రమ్యకృష్ణ పదికి ఒక్క మార్కు వేయటం గమనార్హం. మరి.. రమ్య కూల్ రియాక్షన్ కు వనిత ఎలా రియాక్టు అవుతారో చూడాలి.

Tags: actress ramyakrishnanactress vanita vijaykumarbigboss reality showsensational commentswar of words
Previous Post

వెంకటేశ్ కుమార్తె గురించి మీరిలా ఎప్పుడూ ఆలోచించి ఉండరు

Next Post

టీడీపీకి భారీ షాక్‌.. కీల‌క నేత‌ను ప‌ట్ట‌ప‌గ‌లు హ‌త్య చేసిన వారి విడుద‌ల‌

Related Posts

Movies

టాలీవుడ్ లో ప్రముఖ దర్శకుడు మృతి

February 2, 2023
Movies

మెగా రికార్డుపై పఠాన్ కన్ను

February 1, 2023
Ram Charan in rrr
Andhra

అస్కార్ చిత్రాల్ని వెనక్కి నెట్టి మరీ ‘ఆర్ఆర్ఆర్’ ఆ అవార్డు

February 1, 2023
Samantha fitness
Movies

స‌మంత సినిమా మ‌ళ్లీ వాయిదా?

February 1, 2023
Movies

పవన్ అభిమానుల్లో సంబరాలు.. సందేహాలు

January 30, 2023
Anupama Parameswaran
Gallery

anupama parameswaran : నల్లటి చీరలో చిలిపి అందాలు

January 29, 2023
Load More
Next Post

టీడీపీకి భారీ షాక్‌.. కీల‌క నేత‌ను ప‌ట్ట‌ప‌గ‌లు హ‌త్య చేసిన వారి విడుద‌ల‌

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • మా ఇద్దరి గురించి మాట్లాడితే..‘డొక్క పగలదీసి డోలు కడతాం’
  • కోటంరెడ్డిపై వేటు…ఆదాలకు అందలం
  • పెద్దిరెడ్డి ఇలాకాలో లోకేష్ యాత్ర…ఉద్రిక్తత
  • టాలీవుడ్ లో ప్రముఖ దర్శకుడు మృతి
  • టీడీపీతో టచ్ లో ఆనం..షాకింగ్ ఆరోపణలు
  • అమ్మాయిలను చూసి స్పృహ తప్పిన అబ్బాయి
  • కోటంరెడ్డి ఇష్యూలో ఇంటెలిజెన్స్ ఎంట్రీ
  • యనమల సవాల్ ను జగన్ స్వీకరిస్తారా?
  • కోటంరెడ్డిపై పేర్ని నాని షాకింగ్ కామెంట్స్
  • జగన్ భూ బకాసురుడు…లోకేష్ ఫైర్
  • మెగా రికార్డుపై పఠాన్ కన్ను
  • కోటంరెడ్డి ఇష్యూపై బాలినేని సంచలన వ్యాఖ్యలు
  • నెల్లూరు వైసీపీలో క‌ల‌క‌లం.. బ‌ల‌మైన నేత‌లు దూరం?
  • ఆనం వారి సంక‌టం.. ఓ రేంజ్‌లో..!
  • Budget 2023 : మోడీ ఆశ బారెడు

Most Read

ఆర్ఆర్ఆర్.. వాట్ ఎ ఫీట్

విచారణలో అవినాష్ రెడ్డికి సీబీఐ షాక్

చంద్రబాబు తాజా విజ‌న్‌.. అదిరిపోలా!!

బ్లండర్ : మ‌రో వివాదంలో సీఎం జగన్ !

ఇది.. వైసీపీ కోరి పెట్టుకుంటున్న కుంప‌టి!!

అవినాష్ రెడ్డి కాల్ డేటా పట్టేసిన సీబీఐ

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra