• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

కశ్మీర్ పై మోడీ మరో షాకింగ్ నిర్ణయం

admin by admin
August 18, 2022
in India, Politics, Top Stories
0
modi

New Delhi: Prime Minister Narendra Modi speaks during the National Youth Parliament Festival, 2019 Awards function, in New Delhi, Wednesday, Feb 27, 2019. (PTI Photo/Manvender Vashist) (PTI2_27_2019_000026B)

0
SHARES
286
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp
జమ్ముకశ్మీర్ లో రాజకీయ పరిస్థితుల్లో పెను మార్పులు తీసుకురావాలన్న పట్టుదలతో ఉన్న మోడీ సర్కారు అందుకు తగ్గట్లే నిర్ణయాలు తీసుకోవటం తెలిసిందే. దశాబ్దాల తరబడి నలుగుతున్న ఆర్టికల్ 370 రద్దుతో పాటు పలు సంచలన నిర్ణయాల్ని తీసుకున్న మోడీ సర్కారు ఇప్పుడు మరో సరికొత్త అడుగు ముందుకు వేసింది. ఇందులో భాగంగా జమ్ముకశ్మీర్ ఎన్నికల సంఘం సంచలన ప్రకటన చేసింది. స్థానికేతరులను సైతం ఓటర్లుగా పరిగణలోకి తీసుకుంటున్నట్లుగా వెల్లడించింది.

వారందరికి ఓటుహక్కు కల్పిస్తామని స్పష్టం చేసింది. జమ్ముకశ్మీర్ ఎన్నికల సంఘం సీఈవోగా వ్యవహరిస్తున్న హర్దేశ్ కుమార్ తాజాగా కీలక ప్రకటన చేశారు. కశ్మీర్ లోయలో రాజకీయ దుమారాన్ని రేపేలా ఆయన ప్రకటన ఉంది. ఆర్టికల్ 370 రద్దు.. జమ్ము కశ్మీర్ – లఢఖ్ ప్రాంతాల్ని కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చిన నేపథ్యంలో రాజకీయ స్థిరత్వం కోసం కేంద్రం ప్రయత్నాల్ని ముమ్మరం చేసే క్రమంలో తాజా నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్పొచ్చు.

ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఇప్పటివరకు ఎన్నికల్ని నిర్వహించకుండా ఉన్న వేళ.. మరింత ఆలస్యం కాకుండా చూడాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా ఉంది. ఇందులో భాగంగా స్థానికేతరులకు సైతం ఓటు హక్కు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మధ్యనే కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. కశ్మీర్ లో ఎన్నికల నిర్వహణ త్వరలోనే ఉంటుందని చెప్పటం తెలిసిందే. తాజాగా చేసిన ప్రకటన నేపథ్యంలో కశ్మీర్ వ్యాలీలో నివసించే ఉద్యోగులు.. విద్యార్థులు.. వలస కూలీలు.. ఇలా బయట నుంచి వచ్చిన వారంతా కూడా ఓటుహక్కు లభించనుంది.

వాళ్లు తమ ఓటర్లుగా నమోదు చేసుకునే సమయంలో రెసిడెన్స్ ఆప్షన్  తప్పనిసరేం కాదని.. దానికి మినహాయింపు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
కశ్మీర్ లో భద్రత కోసం వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన సిబ్బంది సైతం ఓటుహక్కుకు అర్హులేనని.. వాళ్లు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని సీఈవో హిర్దేశ్ కుమార్ చెప్పారు. 2022 అక్టోబరు 1 నాటికి 18 ఏళ్లు నిండి.. జమ్ముకశ్మీర్ లో ఉండే ప్రతి ఒక్కరు తమను ఓటర్లుగా నమోదు చేసుకునే వీలు కల్పిస్తున్నట్లుగా చెప్పారు.

నవంబరు 25 లోపు ఓటర్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఉన్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఓటర్ల జాబితాలో 76 లక్షల మంది ఉంటే.. జమ్ముకశ్మీర్ లో పద్దెనిమిదేళ్లు పైబడిన జనాభా 98 లక్షలకు పైనే. ఇప్పుడు వీరందరిని ఓటర్లుగా తీసుకురావాలన్న ఆలోచనలో ఉన్నారు.
తాజా నిర్ణయంపై  కశ్మీర్ రాజకీయ నేతలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అక్కడి పార్టీలు కేంద్రం తీరును తీవ్రంగా తప్పు పడుతున్నారు.

విమర్శలతో విరుచుకుపడుతున్నారు. బీజేపీ ఓటు రాజకీయమంటూ కశ్మీర్ కు ముఖ్యమంత్రులుగా వ్యవహరించిన మొహబూబా ముఫ్తీ.. ఒమర్ అబ్దుల్లాలు తన ఆగ్రహాన్ని ట్వీట్ల రూపంలో పోస్టు చేస్తున్నారు. మొత్తానికి కశ్మీర్ లో తీసుకున్న ఈ కీలక నిర్ణయంతో పలు పరిణామాలు చోటు చేసుకునే వీలుందన్న మాట వినిపిస్తోంది.

Tags: EC shocking decisionkashmir electionspm modishocking decisionvote enrollment for non kashmiris
Previous Post

లక్కీ ఛాన్స్ మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

Next Post

జనాభా పెరుగుదలకు రష్యా వింత నిర్ణయం

Related Posts

Andhra

వైసీపీకి షాక్‌.. కేశినేని నాని ఓటుతో టీడీపీలో సంబ‌రాలు..!

June 16, 2025
Andhra

తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డికి అభినందనలు

June 16, 2025
Movies

`రాజాసాబ్‌` టీజర్‌.. ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆక‌లి తీర్చిన మారుతి!

June 16, 2025
Movies

రాజ‌మౌళి ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్.. గెస్ చేస్తే మీరు గ్రేట్‌..!

June 16, 2025
India

విజ‌య్ రూపానీ మృత‌దేహం ల‌భ్యం.. కానీ

June 16, 2025
India

గుజరాత్ ప్రమాదం..ఆ వ్యక్తి విమానం నుంచి దూకలేదా?

June 16, 2025
Load More
Next Post
vladimir putin

జనాభా పెరుగుదలకు రష్యా వింత నిర్ణయం

Please login to join discussion

Latest News

  • వైసీపీకి షాక్‌.. కేశినేని నాని ఓటుతో టీడీపీలో సంబ‌రాలు..!
  • తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డికి అభినందనలు
  • `రాజాసాబ్‌` టీజర్‌.. ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆక‌లి తీర్చిన మారుతి!
  • రాజ‌మౌళి ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్.. గెస్ చేస్తే మీరు గ్రేట్‌..!
  • విజ‌య్ రూపానీ మృత‌దేహం ల‌భ్యం.. కానీ
  • ఇండ‌స్ట్రీకి రేవంత్ రెడ్డి బిగ్ ఆఫ‌ర్‌
  • గుజరాత్ ప్రమాదం..ఆ వ్యక్తి విమానం నుంచి దూకలేదా?
  • ఉత్తరాఖండ్ లో కుప్పకూలిన హెలికాఫ్టర్.. 7గురు దుర్మరణం
  • ఆ స్టార్ యాంక‌ర్ చీర‌కు అల్లు అర్జున్ కూడా ఫిదా.. వీడియో వైర‌ల్!
  • క‌త్తిని కానుక‌గా ఇచ్చిన‌ అభిమాని.. క‌మ‌ల్ ఆగ్ర‌హం.. వీడియో వైర‌ల్!
  • గుంటూరు రూపురేఖలు మార్చిన పెమ్మసాని
  • ముగిసిన లోకేష్‌ డెడ్‌లైన్.. గెట్ రెడీ వైసీపీ..!
  • నాడు బ‌న్నీ.. నేడు బాల‌య్య‌.. గ‌ద్ద‌ర్ అవార్డ్స్‌లో పేరు మర్చిపోయిన న‌ట‌సింహం!
  • గుజరాత్ విమాన ప్రమాదం..మరో 11 మంది మృతి
  • కూటమి ఏడాది పాలనపై జనం పల్స్ ఏంటి?
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra