వైసీపీ కీలక నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఓ మహిళా అధికారితో అక్రమ సంబంధం ఉన్నట్లు ఆరోపణులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. గత వైసీపీ ప్రభుత్వంలో దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ గా పని చేసిన శాంతిపై ఆమె భర్త మదన్ మోహన్ స్వయంగా ఫిర్యాదు చేశాడు. తాను విదేశాల్లో ఉండగా తన భార్య గర్భం దాల్చిందని.. ఆమె తల్లి కావడానికి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, గవర్నమెంట్ ప్లీడర్ సుభాష్ లే కారణమని మదన్ మోహన్ సంచలన ఆరోపణులు చేశాడు.
దాంతో గత రెండు రోజుల్లో విజయసాయి రెడ్డి అటు ప్రధాన మీడియాతో పాటు ఇటు సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారారు. అయితే మహిళా అధికారిణితో అక్రమ సంబంధం ఆరోపణలపై తాజాగా ఎంపీ విజయసాయి రెడ్డి రియాక్ట్ అయ్యారు. చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చిన ఆయన.. తనకు ఎటువంటి సంబంధం లేదని, ఆదివాసీ మహిళ విషయంలో తనపై అవాస్తవాలు, ఆధారాలు లేని ప్రచారం చేస్తున్నరాని మండిపడ్డారు. ప్లాన్ ప్రకారం నిరాధారమైన ఆరోపణలతో తన పేరు, ప్రతిష్ఠను దిగజార్చేందుకు ప్రయత్నిస్తున్నారని విజయసాయి రెడ్డి తెలిపారు.
ఆదివాసీ మహిళతో సంబంధాన్ని అంటగట్టిన వారు వాటిని రుజువు చేయాలని సవాల్ విసిరారు. కుట్ర, కుతంత్రాల వెనుక ఎవరున్నారో తేలుస్తానని.. వివరణ తీసుకోకుండా, ఆధారాలు లేకుండా దుష్ప్రచారం చేసిన టీవీ ఛానళ్లతో ఎలా క్షమాణాలు చెప్పించాలో తనకు తెలుసని విజయసాయి రెడ్డి చెప్పుకొచ్చారు. యూట్యూబ్ ఛానల్స్ లీగల్ చర్యలు తీసుకుంటానని ఆయన తెలిపారు. తనపై దుష్ప్రచారం చేస్తున్నవారు ఎంతటి వారైన వదిలిపెట్టమని.. తమ పార్టీ వాళ్లైనా వారికి బుద్ధి చెప్పి తీరతానని వార్నింగ్ ఇచ్చారు. స్కాలర్షిప్ విషయంలో మదన్ మోహన్ తనను రెండు సార్లు కలిశాడని.. అంతకు మించి అతనెవరో కూడా తనకు తెలియదని విజయసాయి రెడ్డి వివరణ ఇచ్చారు.