భారత ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ ఎం.వెంకయ్య నాయుడు కరోనా బారిన పడ్డారు. మంగళవారం కోవిడ్ -19 పరీక్షలు చేయగా ఆయనకు పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. ఆయన భార్య ఉషా నాయుడికి నెగెటివ్ గా తేలింది. అదృష్టవ శాత్తూ వెంకయ్యనాయుడికి ఎలాంటి లక్షణాలు లేవు. ఆయన మంచి ఆరోగ్యంతో ఉన్నారు, అయినా వైద్యుల పర్యవేక్షణలో, హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు ఉప రాష్ట్రపతి కార్యాలయం తెలిపింది.
“ఈ రోజు ఉదయం రొటీన్ కోవిడ్ -19 పరీక్షలకు హాజరైన వెంకయ్యనాయుడికి ఈ సాయంత్రం పాజిటివ్ గా నిర్దారించారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో రాజ్యసభ చైర్‌పర్సన్‌గా ఉన్న వెంకయ్య నాయుడు చురుకుగా పాల్గొన్నారు. బహుశా ఆ క్రమంలో ఆయనకు సోకి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
వెంకయ్యనాయుడు గారు త్వరగా కోలుకోవాలని పలువురు ప్రముఖులు ఆకాంక్షిస్తూ ట్విట్టరు ద్వారా తమ సందేశం తెలిపారు. స్పందించిన వారిలో నితిన్ గడ్కరీ, నిర్మల సీతారామన్, చంద్రబాబునాయుడు, నారా లోకేష్, కె.లక్ష్మణ్, రాంలాల్, ధర్మేంద్ర ప్రధాన్ తదితరులు కోరుకున్నారు. ఇక దేశంలో కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది.