అబద్ధానికి మేకప్ వేసి అదే నిజం అని జనాల చేత నమ్మించడంలో వైసీపీ సోషల్ మీడియా, వైసీపీ అనుకూల మీడియాకు ఆస్కార్ అవార్డు ఇచ్చినా తక్కువే. సంబంధం లేని విషయాలతో ఎదుటి వారిని డ్యామేజ్ చేయడానికి ఏమీ వెనుకాడరు. అయితే, వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నపుడు వారు చేసేది చిల్లర పని అని, జనం చీదరించుకుంటారు అని తెలుగుదేశం మీడియా పొరపాటు పడింది. కానీ జనం నమ్మేదాకా వారు అబద్ధాలు చెబుతూనే ఉన్నారు అని అధికారం పోయేసరికి టీడీపీకే కాదు, జర్నలిస్టులు, విశ్లేషకులకు కూడా షాక్ తగిలింది.
పోలవరం నుంచి అమరావతి వరకు వైసీపీ సోషల్ మీడియా ఆడని అబద్ధమే లేదు. చివరకు తాజాగా తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాలు మునిగినా కృష్ణా పక్కనే ఉన్న అమరావతి మునగకపోవడం వారిని కలచివేసింది. అందుకే వేరే ప్రాంతానికి చెందిన పాత ఫొటోలు పెట్టి సోషల్ మీడియాలో అబద్ధం వదిలారు. దానిని సోషల్ మీడియా చీల్చి చెండాడింది. చివరకు వైసీపీ మీడియా చేత క్షమాపణలు చెప్పేదాక వదల్లేదు.
అయితే, తాజాగా రఘురామరాజు విమర్శలు తట్టుకోలేక ఆయనను ఏమీ చేయలేక పిసుక్కుంటున్నారు. చివరకు వారికి అబద్ధంతో ఆడుకోవడానికి ఒక అవకాశం దొరికింది. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ కాలపరిమితి ఏడాది. 2019 లో రఘురామరాజుకు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ పదవి దక్కింది. దాని కాలపరిమితి అక్టోబరు 9వ తేదీతో ముగిసింది. దీంతో ఆ పదవిని వైసీపీకి చెందిన ఎంపీ బాల శౌరికి (ఈయన జగన్ సొంత మతస్థుడు) ఇచ్చారు.
అంతే… రఘురామరాజు మీద సీబీఐ కేసు నమోదు కావడంతో స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ పదవి నుంచి పీకేసారని, ఆయనకు పెద్ద ఝలక్ తగిలిందని వైసీపీ సోషల్ మీడియా ప్రచారం మొదలుపెట్టింది. దానికి వైసీపీ మీడియా వంత పాడింది. ఇంకే ముందు దున్నకు పాలుపిండేశారు. ఆ పాలు జనాలందరికీ తాపించే ప్రయత్నం చేశారు.
ఇదంతా చూసి లైన్లోకి వచ్చిన రఘురామరాజు ఒరే పిచ్చిసన్నాసుల్లారా అది మీరే మూడు నెలల క్రితం పీకేయాలని ప్రయత్నించినా పీకలేకపోయిన పదవి. ఇపుడు కాలపరిమితి ముగిసింది. నన్నెవరూ పీకలేదు. మీరు అనర్హత పిటిషను వేయించలేకపోయారు ఈ అబద్ధం మొదలుపెట్టారు అంటూ త్రిబులార్ వైసీపీ గాలి తీశాడు.