ఇప్పటికిప్పుడు స్టేటస్ గురించి మాట్లాడే ఏకైక వీరుడు ఎవరు అని వెతుకుతున్నారు అంతా ! ఆ వీర శూర తత్వాలు మన ఎంపీలలో ఉన్నాయో లేవో అని వెతుకుతున్నారు మరి ! ఏ విధంగా చూసుకున్నా స్టేటస్ పై ఇళయరాజా సాయం కూడా తీసుకుంటే మేలు.
రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్, మరో సంగీత కారుడు ఇళయ రాజా , మరో నిర్మాత నిరంజన్ రెడ్డి లాంటి పెద్దలంతా కలిసి ఏపీ గురించి మాట్లాడితే బాగుంటుంది. ఇప్పుడున్న ఏకైక ఛాయిస్ కూడా అదే.. కానీ రాజ్యసభకు నామినేట్ అయిన స్టోరీ రైటర్ విజయేంద్ర ప్రసాద్ పై ట్రోల్స్ సాగుతూనే ఉన్నాయి.
తెలుగు చిత్ర సీమకు ఆయన చేసిన సేవలేంటని ప్రశ్నిస్తున్నాయి కొన్ని వర్గాలు. ఏదేమయినా దక్షిణాది లో రజకార్ ఫైల్స్ అనే సినిమా ఒకటి తీయగలరా ఆయన, ఇక్కడ అన్యాయం, ఇక్కడి దౌర్జన్యం, ఇక్కడి దౌర్భాగ్యంపై ఆయన ఏమయినా ఏనాడయినా ప్రశ్నించారా? పోనీ ఆయన తీసిన రాజన్న సినిమా ఏమయినా గొప్పగా ఉంటుందా అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు గుప్పిస్తున్నారు నెటిజన్లు.
వాస్తవానికి భారతీయ కథలను ఆయన సరిగా చెప్పలేకపోయారు అన్న వాదన కూడా ఉందని, ముఖ్యంగా వాటినొక వ్యాపార సరుకుగా మార్చారే తప్ప అసలు కథలకు ఉన్న విలువను చాటలేకపోయారు అని పలువురు విమర్శలు చేస్తూ ఉన్నారు.
ఇక ఎలానూ తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తిగా ఆయనకు మంచి పేరు ఉంది కనుక ఏపీకి స్పెషల్ స్టేటస్ పై కేంద్రాన్ని ఏమయినా అడుగుతారా లేదా ఆయనే స్వయంగా ప్రధానిని కలిసి ఈ ప్రాంతం సమస్యలు వివరించి, ఏదయినా పరిష్కారం ఇప్పిస్తారా అన్న వాదన కూడా వినిపిస్తోంది.
ఎందుకంటే 3ఎంపీలు ఉన్న టీడీపీ మాత్రమే స్టేటస్ గురించి మాట్లాడుతుంది. కొత్తగా ఎంపికయిన ఎంపీలు మాత్రం మాట్లాడడం లేదు. పెద్దల సభకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న ప్రమాణం చేసిన ఎంపీలలో సినీ వాడు నిరంజన్ రెడ్డి కూడా ఉన్నారు. పోనీ ఆయన అయినా మన తరఫు మాట్లాడతారా అన్న వాదన కూడా ఉంది. కనుక సినిమా వాళ్లు అంతా కలిసి దక్షిణాదిలో ఎంపిక చేసిన సమస్యలపై మాట్లాడితే ఎంత బాగుంటుంది అన్న అభిప్రాయం కూడా వినవస్తోంది.