రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు పూర్తయ్యాయి. కచ్చితంగా 2019 ఎన్నికల అనంతరం మే 30వ తారీకు నాడు విజయవాడ వేదికగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇప్పటికి నాలుగు సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ నాలుగేళ్లలో రాష్ట్రంలో ఎలాంటి ప్రగతి నమోదయింది.. అనేది ఆసక్తిగా మారింది. మరో 10 మాసాల్లో ఎన్నికలు ఉండడం వైసిపి ప్రభుత్వం నాలుగు సంవత్సరాల పూర్తి చేసుకోవడం ఇంకోవైపు ప్రతిపక్షాలు ప్రజలకు చేరువు కావడం నేపథ్యంలో వైసిపి సాధించిన ప్రగతి ఏ మేరకు ఉంది జనాలను ఏ మేరకు ఇది అభివృద్ధి చేసే దిశగా సాగింది అనేది ఆసక్తిగా మారింది.
మేధావులు రాజకీయ విశ్లేషకులు కూడా ఈ నాలుగేళ్ల పాలనపై ఆసక్తిగా చర్చ చేస్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో చూసుకుంటే ఎక్కడా అభివృద్ధి అనేది కనిపించడం లేదు. సంక్షేమ ప్రభుత్వం అని చెప్పుకుంటున్న వైసీపీ ప్రభుత్వం కేవలం అప్పులు చేయటం డబ్బులు పంచడం వరకే పరిమితమైంది. అదే సమయంలో రాష్ట్రానికి సంబంధించినటు వంటి అభివృద్ధి పనులు పోలవరం అభివృద్ధి కానివ్వండి రాజధాని అభివృద్ధి లేదా ఇతర ప్రాజెక్టుల అభివృద్ధి విశాఖ ఉక్కు కర్మా గాని నిలబెట్టుకోవడం రాష్ట్రానికి సంబంధించినటువంటి వెనుకబడిన జిల్లాలకు సంబంధించిన అభివృద్ధి ఇతర ప్రాజెక్టులు సాగునీటి వనరులు అభివృద్ధి పనుల కల్పన వంటివి వదిలేసిందని అంటున్నారు.
ఈ ఉపాధి కల్పన ఉద్యోగాలు వంటి విషయాలను తీసుకున్నప్పుడు ప్రగతి రూపంలో రాష్ట్రం చాలా చాలా వెనకబడింది అనేది కేంద్రం కూడా చెబుతున్నటువంటి మాట. ఈ విషయంలో కొందరు వైసిపి నాయకులు కూడా అంగీకరిస్తున్నారు. “మేము సంక్షేమ ప్రభుత్వాన్ని అమలు చేస్తున్నాం తప్ప అభివృద్ధి ప్రభుత్వం కాదు“ అని వాళ్ళు పరోక్షంగా చెబుతున్నటువంటి నేపథ్యంలో ఈ నాలుగు సంవత్సరాల ప్రగతి సున్నా అనే చెప్పాలి. దీంతో మేధావులు అదేవిధంగా పట్టణ నగరాల్లో ఉన్నటువంటి చదువుకున్నటువంటి ఓటర్లు ఈ పార్టీకి దూరంగా ఉన్నారని చెప్పాలి.
ఇక జగన్మోహన్ రెడ్డి పెడుతున్నటువంటి కేసులు ఇతర ఇతర విషయాలను కూడా మేధావులు చదువుకున్న వర్గాల మధ్య చర్చకి వస్తోంది. దీంతో వైసిపి ప్రభుత్వం నాలుగేళ్లలో చేసింది ఏమీ లేదు అనేటటువంటి మాట ఎక్కువగా వినిపిస్తున్నటువంటి మాట గానే చెప్పాలి. ఇక, రాష్ట్రంలో ఉన్నటువంటి 15 శాతం మంది ప్రజలకు అందునా 12 శాతం వరకు మాత్రమే ఈ సంక్షేమం అమలు చేస్తున్నారు. ఈ సంక్షేమాన్ని అడ్డుపెట్టుకుని కోట్లాది రూపాయలు వడ్డీలకి తీసుకు రావడం దాన్ని ప్రజలపై వివిధ రూపాల్లో పన్నుల రూపంలో వేయడం వంటిది చాలా చర్చనీయాంశంగా మారింది.
దాదాపు 85 శాతం మంది కడుతున్నటువంటి పన్నులను తీసుకువెళ్లి 15% మంది ప్రజలకు పంపకాలు చేయటం దీన్ని రాజకీయంగా వాడుకోవడం ప్రభుత్వం చేస్తున్నటువంటి పని అని ఎక్కువ మంది ప్రజలు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల మేధావులు ఉద్యోగులు అదేవిధంగా నిరుద్యోగులు యువత వైసీపీకి దూరంగా ఉన్నారు. దీన్ని అనుకూలంగా మలుచుకునేందుకు టిడిపి కూడా లోలోపల ప్రయత్నాలు చేస్తోంది. అభివృద్ధి లేదు రాజధాని లేదు అదే విధంగా ప్రాజెక్టులు ముందుకు వెళ్లలేదు కీలకమైనటువంటి పోలవరం ప్రాజెక్టు పూర్తికాకుండా చేశారు. అనేది స్పష్టంగా కనిపిస్తోంది. ఇట్లాంటివన్నీ కూడా వైసీపీకి ప్రాణ సంకటంగానే మారాయి అని చెప్పడంలో ఈ నాలుగేళ్ల పాలన స్పష్టం చేస్తోందని మేధావులు చెబుతున్నారు.