తెలుగు వ్యక్తి భారత ప్రధాన న్యాయమూర్తి అయ్యారు. ఆయన తొలిసారి తెలంగాణకు రావడంతో ప్రముఖులందరూ మర్యాద పూర్వకంగా కలుస్తున్నారు.
ఆయన రాకను పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఘనంగా స్వాగతం పలికింది. ముఖ్యమంత్రి, గవర్నర్ స్వయంగా ఆయనను సత్కరించారు.
ఏపీలో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. తిరుమలకు వెళ్లి శ్రీవారి దర్శనం చేసుకున్న అనంతరం ఎన్వీ రమణ హైదరాబాదు తిరిగి వచ్చారు.
ప్రత్యేక అతిథి గృహంలో ఉన్న ఆయనను కలవడానికి రాజ్ భవన్ గెస్ట్ హౌస్ వద్దకు వస్తున్నారు. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ ఎన్వి రమణను కలిసి సత్కరించారు. డిజిపి మహేందర్ రెడ్డితో పాటు, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనర్లు కూడా సిజెఐ ఎన్వి రమణను కలుసుకుని సత్కరించారు.
జస్టిస్ రమణ 2021 ఏప్రిల్ 24 న…. 48 వ సిజెఐగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన ప్రస్తుతం రాజ్ భవన్ లో ఉంటున్నారు.