తన తండ్రి పెట్టిన పథకాలు తెలంగాణలో సరిగా అమలుకావడం లేదని షర్మిలక్క బోరుమంటోంది. తాను తెలంగాణ ఉద్యమంలో పాల్గొనకపోయినా తెలంగాణపై ప్రేమ ఉండకూడదా అంటోంది షర్మిలక్క.
ఈరోజు లోటస్ పాండ్ లో టీఆర్ఎస్ అభిమానుల కళ్లు తెరిపించింది షర్మిలక్క. ఫీజు రీఎంబర్స్ మెంట్ అందటం లేదంట. విద్యార్థులకు అండగా ఉంటుందట షర్మిలక్క. అక్కడ ఏపీలో జగనన్నయ్య మొత్తం పీజీ విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్ మెంటే ఎత్తేస్తే అక్కడ అన్నను ప్రశ్నించకుండా తెలంగాణలో ప్రశ్నిస్తోంది షర్మిలక్క.
నిజానికి ఫీజు రీఎంబర్స్ మెంట్ రాజన్న బిడ్డ ఎగ్గొడితే …. కేసీఆర్ మాత్రం ఎంచక్కా అందరికీ ఇస్తున్నాడు. వైఎస్సార్ ప్రవేశపెట్టిన పథకాలు తెలంగాణలో అమలుకావడం లేదని అక్కయ్య బాధపడుతోంది. తెలంగాణ బిడ్డలతో పాటు ఏపీ బిడ్డల పరిస్థితిని కూడా తెలంగాణ అసలుసిసలు బిడ్డయిన వీసా షర్మిల ప్రశ్నిస్తే బాగుంటుందేమో.