• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ఎన్నికల సంఘంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం.. షాకింగ్ వ్యాఖ్యలు

ఈసీపై తెలంగాణ హైకోర్టు ధర్మాగ్రహం.. భూమి మీద నివసిస్తున్నారా? ఆకాశంలోనా?

admin by admin
April 29, 2021
in Politics, Telangana, Top Stories
1
0
SHARES
253
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

తెలంగాణ హైకోర్టుకు ఆగ్రహం వచ్చింది. నిజానికి దాన్ని ధర్మాగ్రహం అనటం సబబుగా ఉంటుందేమో? వ్యవస్థలు చేస్తున్న తప్పులు ప్రజల జీవితాలకు ప్రమాదకరంగా మారుతున్న వేళ.. న్యాయం కోసం తమను ఆశ్రయించిన నేపథ్యంలో.. విచారణ చేపట్టిన న్యాయస్థానం తమ ముందుకు వచ్చిన వివరాలు.. ఆధారాలతో పాటు ఇరు వర్గాల వాదనల్ని విన్న తర్వాత.. రాష్ట్ర ఎన్నికల సంఘంపైనా.. రాస్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. చర్రుమనిపించే వ్యాఖ్యలు చేసింది.

కరోనా నేపథ్యంలో తీసుకుంటున్న నిర్ణయాలపై విస్మయం వ్యక్తం చేసిన న్యాయస్థానం.. ‘భూమి మీద నివిస్తున్నారా? ఆకాశంలోనా? యుద్ధం వచ్చినా.. ఆకాశం మీద పడినా ఎన్నికలు జరగాల్సిందేనా?’ అని ప్రశ్నించింది. అసలు ఎన్నికల సంఘం అధికారులు క్షేత్రస్థాయి పరిస్థితుల్ని గమనిస్తున్నారా? అంటూ మండిపడింది. కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఎన్నికలకు ఎందుకు వెళ్లారని ప్రశ్నించింది. ప్రజల ప్రాణాలు విలవైనవా? ఎన్నికలా? అని నిలదీసిన కోర్టు.. కొన్ని మున్సిపాలిటీలకు ఇంకా సమయం ఉంది కదా? ఇప్పుడు ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఏమిటన్నసందేహాన్నివ్యక్తం చేసింది.

హైకోర్టు సందేహానికి సమాధానం చెప్పే ప్రయత్నంలో ఎన్నికల సంఘం తరఫున న్యాయవాది వినిపించిన వాదనలపై కోర్టు మరింత మండిపడింది. రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయంతోనే ఎన్నికల్ని నిర్వహించినట్లుగా చెప్పటంపై అసహనం వ్యక్తం చేసిన కోర్టు.. ‘ఎన్నికలు వాయిదా వేసే అధికారం ఎన్నికల సంఘానికి లేదా? ఎన్నికల ప్రచార సమయం కూడా ఎందుకు తగ్గించలేదు?’ అని ప్రశ్నించింది.

కరోనా కట్టడిని వదిలేసి.. ఎన్నికల పనుల్లో ఉండే పరిస్థితి ఉందన్న హైకోర్టు.. ఎన్నికల సంఘం ఇచ్చిన వివరణపై అసహనం వ్యక్తం చేశారు. అధికారులు విచారణకు హాజరు కావాలని కోరారు. కరోనా కేసులు అంతకంతకూ ఎక్కువ అవుతున్న వేళలో ఎన్నికల నిర్వహణ సబబు కాదన్న మాట పలువురి నోటి నుంచి వచ్చినా.. అదేమీ పట్టకుండా ప్రభుత్వం మొండిగా నిర్వహించిన వైనంపై హైకోర్టు ఆగ్రహం ఇప్పుడు సంచలనంగా మారింది.

Tags: angrycm kcrcovid-19 second waveelection commissionelectionstelangana high court
Previous Post

గుండెపోటుతో కాలిఫోర్నియా నివాసి మృతి

Next Post

ఈ అందానికి అపుడే 36 ఏళ్లు !

Related Posts

Top Stories

మా ఇద్దరి గురించి మాట్లాడితే..‘డొక్క పగలదీసి డోలు కడతాం’

February 2, 2023
sajjala ramakrishna reddy
Trending

కోటంరెడ్డిపై వేటు…ఆదాలకు అందలం

February 2, 2023
Trending

పెద్దిరెడ్డి ఇలాకాలో లోకేష్ యాత్ర…ఉద్రిక్తత

February 2, 2023
Top Stories

టీడీపీతో టచ్ లో ఆనం..షాకింగ్ ఆరోపణలు

February 2, 2023
Top Stories

అమ్మాయిలను చూసి స్పృహ తప్పిన అబ్బాయి

February 2, 2023
kotam reddy sridhar reddy
Trending

కోటంరెడ్డి ఇష్యూలో ఇంటెలిజెన్స్ ఎంట్రీ

February 2, 2023
Load More
Next Post

ఈ అందానికి అపుడే 36 ఏళ్లు !

Comments 1

  1. buy cialis and viagra online says:
    4 months ago

    This is very fascinating, You are an excessively professional blogger.
    I have joined your rss feed and stay up for searching for extra of your great post.
    Additionally, I have shared your website in my social networks

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • మా ఇద్దరి గురించి మాట్లాడితే..‘డొక్క పగలదీసి డోలు కడతాం’
  • కోటంరెడ్డిపై వేటు…ఆదాలకు అందలం
  • పెద్దిరెడ్డి ఇలాకాలో లోకేష్ యాత్ర…ఉద్రిక్తత
  • టాలీవుడ్ లో ప్రముఖ దర్శకుడు మృతి
  • టీడీపీతో టచ్ లో ఆనం..షాకింగ్ ఆరోపణలు
  • అమ్మాయిలను చూసి స్పృహ తప్పిన అబ్బాయి
  • కోటంరెడ్డి ఇష్యూలో ఇంటెలిజెన్స్ ఎంట్రీ
  • యనమల సవాల్ ను జగన్ స్వీకరిస్తారా?
  • కోటంరెడ్డిపై పేర్ని నాని షాకింగ్ కామెంట్స్
  • జగన్ భూ బకాసురుడు…లోకేష్ ఫైర్
  • మెగా రికార్డుపై పఠాన్ కన్ను
  • కోటంరెడ్డి ఇష్యూపై బాలినేని సంచలన వ్యాఖ్యలు
  • నెల్లూరు వైసీపీలో క‌ల‌క‌లం.. బ‌ల‌మైన నేత‌లు దూరం?
  • ఆనం వారి సంక‌టం.. ఓ రేంజ్‌లో..!
  • Budget 2023 : మోడీ ఆశ బారెడు

Most Read

ఆర్ఆర్ఆర్.. వాట్ ఎ ఫీట్

విచారణలో అవినాష్ రెడ్డికి సీబీఐ షాక్

చంద్రబాబు తాజా విజ‌న్‌.. అదిరిపోలా!!

బ్లండర్ : మ‌రో వివాదంలో సీఎం జగన్ !

ఇది.. వైసీపీ కోరి పెట్టుకుంటున్న కుంప‌టి!!

అవినాష్ రెడ్డి కాల్ డేటా పట్టేసిన సీబీఐ

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra