2024లో ఏపీలో అధికారంలోకి వచ్చి తీరాలని నిర్ణయించుకున్న ప్రధాన ప్రతిపక్షంటీడీపీ ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. తాజాగా ఎన్నికల ప్రచార పాటను రిలీజ్ చేసింది. ఈ పాట యువతను ఆకట్టుకునేలా.. మేదావులను సైతం రోమాలు నిక్కబోడుచుకునేలా ఉండడం వివేషం. టీడీపీ అభిమానులు పార్టీ విజయాన్ని కాంక్షిస్తూ ఓ పాటను ఎన్టీఆర్ జిల్లా ఈడుపుగల్లులో షూట్ చేశారు. పాట చిత్రీకరణలో.. కంకిపాడు మండలంలోని పార్టీ అభిమానులు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 2024 లో జరగబోయే ఎన్నికల్లో టీడీపీ విజయాన్ని సాధిస్తుందని అభిమానులు ఆకాంక్షించారు.
ఆయా పార్టీలు చేసే మంచి పనులు ప్రజల్లోకి తీసుకువెళ్లాలంటే వివిధ రకాలైన సాధనాలు ఉన్నాయి. అందు కోసం పాటల ద్వారా తమ పార్టీ విశిష్టతను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని టీడీపీ నేతలు భావించారు. అనుకున్నదే తడువుగా అందుకు తగిన పాటను సిద్ధం చేసుకున్నారు. తమ పార్టీ చేసిన మంచి కార్యక్రమాలు, నాయకుడు చంద్రబాబు గురించిన గొప్పలక్షణాలు ఆ పాటలో తెలిపేందుకు సిద్ధమయ్యారు.
తెలుగుదేశం పార్టీ విజయానికి అందించే ప్రయత్నంలో భాగంగా ఆ పార్టీకి చెందిన పలువురు అభిమానులు పార్టీ విజయాన్ని కాంక్షిస్తూ పాట చిత్రీకరించారు.2024లో జరగబోయే ఎన్నికల్లో టీడీపీ విజయం సాధిస్తుందని వారంతా ఆకాంక్షించారు. అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకత తమ పార్టీ గెలుపుకు నాంది అని ఈడుపుగల్లు గ్రామానికి చెందిన నేత దేవినేని రాజా అన్నారు. కాగా, ఈ పాటను సీడీలు, యూట్యూబ్ సహా.. అన్ని సోషల్ మీడియా వేదికల్లోనూ పెట్టనున్నట్టు చెప్పారు. ఈ పాట చిత్రీకరణకు 5 లక్షల రూపాయలను ఖర్చు చేసినట్టు పార్టీ నాయకులు చెప్పారు.
https://www.etvbharat.com/telugu/telangana/state/hyderabad/tdp-song-shooting-in-ntr-district/ts20221127184538763763024