గంగిగోవు పాలు.. అన్నట్టుగా.. టీడీపీలో ఎంతో మంది ఉన్నా.. పార్టీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులోని పుంగనూరు నియోజకవర్గానికి తాజాగా ఇంచార్జ్‌గా నియమితులైన చల్లా రామచంద్రారెడ్డి ఉరఫ్ చల్లా బాబు.. శభాష్ అని అనిపించుకుంటు న్నారు.
నిజానికి ప్రతిపక్షంపై ఇటీవల కాలంలో దాడులు పెరిగాయి. అయితే.. వాటిని సమర్ధవంతంగా తిప్పికొట్టే నాయకులు పెద్దగా కనిపించడం లేదు. కేసులకు భయపడి, వ్యాపారాలకు భయపడి చాలా మంది వెనుకాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ, చల్లా బాబు మాత్రం “జైళ్లు నిడిపోయినా.. సరే! మేం పోరడతాం!“ అంటూ.. నినదిస్తున్నారు. పార్టీపైనే కాదు.. ఆఖరుకు పార్టీ జెండాదిమ్మపై చేయేసినా ఊరుకునేది లేదని తేల్చి చెబుతున్నారు.
సరైనోడిని నియోజకవర్గం ఇంచార్జి చేస్తే పార్టీ జెండా దిమ్మ ముట్టుకున్నా ఊరుకోడు అని పుంగనూరు లో చూపించారు
— బాబు కోసం (@trollycp) January 30, 2022
ఏం జరిగింది?
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం.. మంత్రి పెద్దిరామచంద్రారెడ్డికి కంచుకోట. ఇలాంటి చోట టీడీపీని అంతం చేయాలని ప్రయత్నాలు సాగుతున్నాయని పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే నియోజకవర్గంలోని చౌడేపల్లెలో తెలుగుదేశం జెండా దిమ్మె తొలగింపునకు పోలీసులు ప్రయత్నించారు.
చౌడేపల్లె బస్టాండ్ కూడలిలో ఉన్న తెలుగుదేశం జెండా దిమ్మెను అధికారులు తొలగించారు. అడ్డుకునేందుకు యత్నించిన మండల అధ్యక్షుడు రమేష్‌రెడ్డిని పోలీసులు అడ్డుకోవడంతో వారికి, తెలుగుదేశం కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకొంది. అనంతరం కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.
పార్టీ శ్రేణులను పరామర్శించేందుకు పుంగనూరు నియోజకవర్గ ఇంచార్జ్ చల్లా రామచంద్రారెడ్డి చౌడేపల్లి బయల్దేరగా మార్గమధ్యంలో రొంపిచర్యల కూడలి వద్ద ఆయనతో పాటు అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆగ్రహించిన కార్యకర్తలు రహదారిపై బైఠాయించగా మరోసారి పోలీసులు, తెలుగుదేశం శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.
స్థానిక వైసీపీ నేతలు కావాలనే తెలుగుదేశం పార్టీ జెండా దిమ్మెను ధ్వంసం చేయడంతో పాటు…పోలీసుల అండతో కార్యకర్తలపై అక్రమకేసులు బనాయిస్తున్నారని చల్లా రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. అంతేకాదు.. అరెస్టులకు భయపడేది లేదన్నారు.
పుంగనూరు లో ఇన్చార్జిగా చల్లా గారు వచ్చాకే పెద్దిరెడ్డి ప్రెస్ మీట్ లు పెట్టటం చాలా తగ్గించేసాడు..నియోజకవర్గంని కాపాడుకునే పనిలో ఉండటమే సరిపోతుంది అనుకుంట..ఇలాంటి బలమైన వాళ్ళని ఇన్చార్జిలుగా అన్ని చోట్లా ఉంచగలిగితే వైసిపి నేతలు టివీల్లో నోరు తూలి మాట్లాడే సాహసం కూడా చెయ్యరు.. https://t.co/Jyd5Rv7oh6
— ????????ã????â???????? ????ö????????à (@BharathGolla) January 29, 2022
పుంజుకున్న పార్టీ!
టీడీపీ పుంగనూరు నియోజకవర్గ ఇంఛార్జిగా నియమితులైన చల్లా రామచంద్రారెడ్డి ఈ నెల 18న తొలిసారిగా చౌడేపల్లెలో పర్యటించారు. ఆ సందర్భంగా గత మూడేళ్ళలో ఏనాడూ జరగని రీతిలో టీడీపీ శ్రేణులు భారీగా స్వచ్ఛందంగా తరలివచ్చాయి.
బైక్ ర్యాలీ కూడా ఆర్భాటంగా నిర్వహించారు. అదే రోజు పార్టీ జెండాను ఆవిష్కరించారు. టీడీపీ కార్యక్రమం అట్టహాసంగా జరగడాన్ని వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోయారు. ఆ రోజే కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ చల్లా రామచంద్రారెడ్డి సహా 17మంది కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు.
టీడీపీ కార్యక్రమం భారీస్థాయిలో నిర్వహించడంపై నియోజకవర్గ అధికార పార్టీ ముఖ్యుడు స్థానిక నేతలు, అధికారులపై మండిపడ్డట్టు సమాచారం. దీంతో అధికారులే టీడీపీ దిమ్మె అక్రమ నిర్మాణమంటూ తొలగించారని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. ఇక, చల్లాబాబుకు పార్టీ అధినేత సహా.. లోకేష్ నుంచి కూడా మద్దతు లభించడం గమనార్హం.